ఆ మెగా హీరోకి కథ చెప్పిన జాతిరత్నాలు డైరెక్టర్..?

Anilkumar
జాతిరత్నాలు సినిమా తో ఒక్క సారిగా తెలుగు ప్రేక్షకుల దృష్టి తో పాటు ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు అనుదీప్ కె.వి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక ఈయన జాతి రత్నాలు సినిమా విడుదలైన వెంటనే తమిళ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ కి ఒక స్టోరీ చెప్పి అతని తో ఓకే చెప్పించుకున్నాడు.ఇదిలావుంటే ఇక తెలుగు మరియు తమిళం లో శివ కార్తికేయన్ హీరో గా ప్రిన్స్ అనే సినిమా ను తెరకెక్కించి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీపావళి కానుకగా అనుదీప్ దర్శకత్వం లో వచ్చిన ప్రిన్స్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో విఫలమైంది.

 అయినా కూడా  ఇక కూడా దర్శకుడు అనుదీప్ కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇదిలావుంటే ఇక తాజాగా ఒక మెగా హీరో నుండి పిలుపు వచ్చిందని సమాచారం అందుతుంది.అయితే గతంలో అనుదీప్ ఆ హీరో కి స్టోరీ లైన్ చెప్పాడని, ఇప్పుడు అదే స్టోరీ లైన్ పూర్తి కథ గా చెప్పాలంటే ఆహ్వానం దక్కిందని సమాచారం అందుతుంది. ఇక మెగా హీరో తో సినిమా అంటే కచ్చితం గా అది భారీ ప్రాజెక్టు అవుతుంది అనడంలో సందేహం లేదు.ఇకపోతే  అనుదీప్ ఈసారి కచ్చితంగా ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమా ను తెరకెక్కిస్తే కెరియర్ లో

 వెన్ను తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అంటూ ఆయన సన్నిహితులతో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు. ఇక జాతి రత్నాలు సినిమా క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదు.అయితే  అందుకే భారీ ఎత్తున అనుదీప్ కి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.ఇదిలావుంటే  తాజాగా వచ్చిన ఈ ఆఫర్ ని సద్వినియోగం చేసుకుంటే ముందు ముందు స్టార్ హీరో లు కూడా అనుదీప్ కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇక  అనుదీప్ కి ఛాన్స్ ఇచ్చిన ఆ మెగా హీరో ఎవరు అనే విషయం మరికొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: