సమంత "యశోద" మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ లలో ఒకరికా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎంతో మంది స్టార్ హీరో ల సరసన నటించి ప్రస్తుతం కూడా టాప్ హీరోయిన్ లలో ఒకరిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే సమంత కమర్షియల్ మూవీ లలో మాత్రమే కాకుండా వైదిధ్యమైన మూవీ లలో నటించి తన నటనతో కూడా ప్రేక్షకులను అలరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత "యశోద" అనే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. హరి శంకర్ - హరీష్ నారాయణ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా , ఉన్ని ముకుందన్ , వరలక్ష్మి శరత్ కుమార్ రావు రమేష్ మురళీ శర్మ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

ఈ మూవీ ని 11 నవంబర్ 2022 వ తేదీన విడుదల చేనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా ,  వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా యశోద మూవీ యూనిట్ ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.  సెన్సార్ బోర్డు నుండి యశోద మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే యశోద మూవీ ని తెలుగు తో పాటు తమిళ్ ,  కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో కూడా ఒకే రోజు విడుదల చేయనున్నారు. మరి ఈ మూవీ తో సమంత బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: