"ఊర్వశివో రాక్షసివో" మూవీ రన్ టైమ్ లాక్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న యువ హీరోలలో ఒకరు ఆయన అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో గౌరవం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత అనేక మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా అల్లు శిరీష్ , రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఊర్వశివో రాక్షసివో అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో అను ఇమాన్యుయల్ హీరోయిన్ గా నటించగా ,  వెన్నెల కిషోర్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించాడు.

ఈ మూవీ ని నవంబర్ 4 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లను అదిరిపోయే రేంజ్ లో నిర్వహిస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ చిత్ర బృందం భారీ ఎత్తున నిర్వహించింది. ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి నట సింహం బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు , పాటలు , పోస్టర్ లు అద్భుతంగా ఉండడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా యూనిట్ , ఈ మూవీ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే ఈ మూవీ రన్ టైమ్ ను కూడా ఈ మూవీ యూనిట్ లాక్ చేసింది. ఈ మూవీ నీ రన్ టైమ్ ను 2 గంటల 14 నిమిషాలకు ఈ మూవీ యూనిట్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా సాధారణ నిడివితో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: