ప్రభాస్ "ప్రాజెక్ట్ కే" మూవీ అప్పుడు విడుదల కానుందా..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి మూవీ వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగిన ప్రభాస్ "మిర్చి" మూవీ తర్వాత బాహుబలి మూవీ ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే బాహుబలి మూవీ తర్వాత భారీ బడ్జెట్ తో తలకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లలో , అంతకు మించిన మూవీ లలో ప్రభాస్ హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రభాస్ ఇప్పటికే సాహో ,  రాదే శ్యామ్ వంటి భారీ బడ్జెట్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ప్రభాస్ అదిరిపోయే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో , అంతకుమించిన మూవీ లలో హీరోగా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కే అనే పాన్ వరల్డ్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  బిగ్ బి అమితా బచ్చన్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ మూవీ ని వచ్చే సంవత్సరం దసరా కానుకగా విడుదల చేయబోతున్నట్లు గతంలో ఈ మూవీ యూనిట్ ప్రకటించిన విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ మూవీ కి  "వి ఎఫ్ ఎక్స్" వర్క్ ఎక్కువగా ఉండడంతో ఈ మూవీ ని వచ్చే సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయడం కష్టమే అని తెలుస్తుంది. ఈ మూవీ ని 10 ఏప్రిల్ 2024 వ తేదీన విడుదల చేయాలి అనే ఆలోచనలో మూవీ యూనిట్ ఉన్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రాజెక్ట్ కే మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: