ఆ యంగ్ డైరెక్టర్ మూవీలో ధనుష్..?

Pulgam Srinivas
కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరిగా కెరియర్ సాగిస్తున్న ధనుష్ గురించి ప్రత్యేకత సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ధనుష్ తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో డబ్ చేసి విడుదల చేశాడు. అందులో రఘువరన్ బీటెక్ ,  మారి , తిరు సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ,  ధనుష్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ధనుష్ "నేనే వస్తున్నా" మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించాడు.

ఈ మూవీ ని తెలుగు లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేశాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన నేనే వస్తున్నా మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. దానితో చివరగా నేనే వస్తున్నా మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ధనుష్ , వెంకీ అట్లూరి దర్శకత్వంలో తేరకేకుతున్న సార్ అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ మూవీ లో సంయుక్త మీనన్ ధనుష్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , జీవి ప్రకాష్ కుమార్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ మూవీ తో పాటు ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ అనే మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు.  ఇది ఇలా ఉంటే ఈ హీరో తాజాగా ఒక యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రహణం ఫేమ్ ఎలన్ తో ధనుష్ ఓ సాలిడ్ మూవీని చేయనున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్ మిల్లర్ మూవీ తర్వాత ధనుష్ , ఏలన్  కాంబినేషన్ మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: