పవన్ విషయంలో షాకింగ్ న్యూస్ బయటపెట్టిన అలీ !

Seetha Sailaja

పవన్ కళ్యాణ్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వకముందే అలీకి పవన్ తో మంచి సాన్నిహిత్యం ఉంది. తరుచూ అప్పట్లో అలీ పవన్ దగ్గరకు వెళ్ళి అతడితో మాట్లాడుతూ ఉండేవాడట. ఆతరువాత ఆ పరిచయం వారిద్దరి మధ్య స్నేహంగా మారడంతో పవన్ అలీ లు మంచి స్నేహితులుగా మారారు. ఆతరువాత కాలంలో పవన్ టాప్ హీరో అయిన తరువాత అతడు నటించిన ప్రతి సినిమాలోను అలీకి ఒక మంచి కామెడీ పాత్రను క్రియేట్ చేసేవారు.

వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హట్ సినిమాలు వచ్చాయి. అయితే ఆతరువాత పవన్ రాజకీయాలలోకి వచ్చిన తరువాత అలీ పవన్ ల మధ్య కొంచం దూరం పెరిగింది అంటారు. దీనికి తగ్గట్టుగానే పవన్ లేటెస్ట్ గా నటించిన ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ సినిమాలలో అలీకి పాత్రను క్రియేట్ చేయకపోవడంతో వీరిద్దరి మధ్య గ్యాప్ ఉంది అన్నవిషయం మరొకసారి చర్చలకు దారితీసింది.

ఇలాంటి పరిస్థితులలో అలీ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ పై చేసిన కామెంట్స్ ఆశక్తిగా మారాయి. అలీ స్వయంగా నిర్మిస్తూ తాను హీరోగా నటించిన ‘అందరు బాగుండాలి అందులో నేనుండాలి’ మూవీ ప్రమోట్ చేస్తూ అలీ పవన్ పై కామెంట్ చేసాడు. తాను హోస్ట్ చేస్తున్న ‘అలీ తో సరదాగా’ కార్యక్రమంలో పవన్ అతిధిగా రావడం ఖాయం అని చెపుతూ ఇప్పటికే తాను ఈవిషయమై పవన్ తో మాట్లాడానని అయితే రాజకీయాలు సినిమాల బిజీతో పవన్ రాలేకపోతున్నాడు అంటూ ఒక సీక్రెట్ బయటపెట్టాడు.

అంతేకాదు చాలామంది భావిస్తున్నట్లుగా తనకు పవన్ కు మధ్య ఎటువంటి గ్యాప్ లేదనీ కేవలం తామిద్దరం వేరువేరు పార్టీలలో ఉన్నంత మాత్రాన తమ మధ్య ఉన్న స్నేహం ఎందుకు పోతుంది అంటూ ఎదురు ప్రశ్నలు వేసాడు. అంతేకాదు తాను తన టాక్ షోలో పవన్ ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇప్పటివరకు ప్రజలకు అతడి అభిమానులకు పవన్ గురించి తెలియని ఎన్నోవిషయాలు తాను లీక్ చేయబోతున్నట్లు వివరించాడు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: