"హిట్ 2" మూవీ నుండి "మీనాక్షి చౌదరి" క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేసిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటీమణులలో ఒకరు అయిన మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ సుశాంత్ హీరోగా తెరకెక్కిన ఇచట వాహనములు నిలబరాదు మూవీ తో తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ ద్వారా ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఆ తర్వాత రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ఖిలాడి మూవీ లో ఈ ముద్దు గుమ్మ రవితేజ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి తన హాట్ హాట్ అందచందాలను ఓలకబోయడానికి కూడా ఏ మాత్రం వెనకడుగు వేయలేదు.
 

దానితో ఖిలాడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించక పోయినప్పటికీ ,  మీనాక్షి చౌదరి మాత్రం తన అందచందాలతో ఖిలాడి మూవీ ద్వారా మంచి గుర్తింపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మీనాక్షి చౌదరి ,  అడవి శేషు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి మీనాక్షి చౌదరి కి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను విడుదల చేసింది. హిట్ ది సెకండ్ కేస్ మూవీ లో మీనాక్షి చౌదరి "ఆర్య" అనే పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం హిట్ ది సెకండ్ కేస్ మూవీ యూనిట్ విడుదల చేసిన మీనాక్షి చౌదరి కి సంబంధించిన  క్యారెక్టర్ పోస్టర్ సోషల్ మీడియాలో అవుతుంది. హిట్ ది సెకండ్ కేస్ మూవీ ని డిసెంబర్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: