కొత్త కారు కొన్న జబర్దస్త్ కమెడియన్..!!

Divya
జబర్దస్త్ లో ఎంతోమంది కమెడియన్లు సైతం అతి తక్కువ కాలంలోనే స్టార్ పొజిషన్లోకి చేరుతున్నారని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఎంతోమంది అందులోని కామెడీయన్స్ ఇల్లు ,పొలాలు, స్థలాలు ,కార్లు తదితర వాటిని కొంటూ ఉన్నారు. ముఖ్యంగా జబర్దస్త్ లోకి టాలెంట్ తో ఎంతోమంది కమెడియన్లు తమ స్థాయిని నిరూపించుకుంటున్నారని చెప్పవచ్చు. అలాంటి వారిలో ఇమ్మాన్యుయేల్ కూడ ఒకరిని చెప్పవచ్చు. ఇక వర్ష తో కలిసి చేసే స్కిట్లకు ప్రేక్షకులకు నుంచి మంచి స్పందన లభిస్తూ ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ షోలో చేస్తు ఇమ్మాన్యుయేల్ రెమ్యూనరేషన్ కూడా పెరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇమ్మాన్యుయేల్ ఈవెంట్లు కూడా చేస్తూ ఉండగా ఈవెంట్లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.తన సంపాదించిన డబ్బుతో తాజాగా ఒక కొత్త కారు కొనుగోలు చేయగా ఆ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు  
ఇమ్మాన్యుయేల్. కొనుగోలు చేసిన కారు ధర విషయానికి వస్తే రూ.14 లక్షల రూపాయలు ఉన్నట్లు సమాచారం.ఇమ్మాన్యుయేల్ ప్రస్తుతం సినిమాల పైన దృష్టి పెట్టాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. తన కామెడీ టైమింగ్ ఉన్న నటుడు కావడంతో ఆయన సినీ రంగంలోకి ప్రవేశిస్తే సక్సెస్ అవుతారని ఇమ్మాన్యుయేల్ అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు.
ఇమ్మాన్యుయేల్ హుందాయి వెన్యూ మైక్రో ఎస్ యు వి కారణం కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. హై ఎండ్ వేరియంట్ మోడల్ గల కారును ఇమ్మాన్యుయేల్ కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇమ్మాన్యుయేల్ కెరియర్ విషయానికి వస్తే రాబోయే రోజుల్లో సక్సెస్ అయ్యే అవకాశం మరిన్ని ఉన్నాయని కామెంట్లు వస్తున్నాయి. ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న పలు కామెడీ షోలలో కూడా పాల్గొని మంచి పేరు సంపాదిస్తున్నారు. ఇక అన్ని ప్రోగ్రాంలో కూడా కనిపిస్తూ పేరు సంపాదిస్తూ పేరు సంపాదించడమే కాకుండా కెరియర్ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లుగా తెలుస్తోంది ఇమ్మాన్యుయేల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: