నేను ఎవరినీ మోసం చెయ్యలేదంటూ పూరి జగన్నాధ్​....!!

murali krishna
పూరీ జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. బద్రి ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2006వ సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన పోకిరి చిత్రం తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది.కాని ఆ తరువాత 2009వ సంవత్సరంలో విడుదలైన నేనింతే దానిని అధిగమించింది. 2009వ సంవత్సరంలో పూరి జగన్నాథ్ కు ఉత్తమ మాటల రచయితగా నేనింతే చిత్రానికి గాను నంది పురస్కారము లభించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు విజయవంతం అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తొలిసారి ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలైన 'లైగర్' ఇండస్ట్రీలోనే అతి పెద్ద డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. పూరీతో పాటు అటు హీరో విజయ్ దేవరకొండ కెరీర్ ను దెబ్బకొట్టింది. ఈ చిత్రానికి నిర్మాతల్లో ఒకరు కావడంతో పూరీకి విడుదల తర్వాత మరిన్ని కష్టాలు వచ్చాయి. సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ తమ నష్టాలను భరించాలని పూరి జగన్నాథ్ ను బెదిరిస్తున్నారు.దీనిపై పూరీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఈ వివాదం నేపథ్యంలో పూరీ ఆదివారం ఓ లేఖ విడుదల చేశారు. విజయం, అపజయం, జీవితం గురించి తనదైన శైలిలో అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇవేవీ శాశ్వతం కాదన్నారు.
ప్రతి సంఘటనని మనం అనుభవంలానే చూడాలన్నారు. లైఫ్ లో రిస్క్ చెయ్యకపోతే అది జీవితమే కాదన్నారు. తన మీద నమ్మకంతో టికెట్ కొని సినిమాకు వచ్చిన ప్రేక్షకులను తప్పితే తాను ఎవ్వరినీ మోసం చేయలేదని పూరీ స్పష్టం చేశారు. మళ్లీ ఇంకో సినిమా తీస్తా..
కచ్చితంగా ఎంటర్ టైన్ చేస్తానని అభిమానులకు భరోసా ఇచ్చారు. జీవితంలో చివరగా అందరూ కలిసేది శ్మశానంలోనే అని, మధ్యలో జరిగేది అంతా డ్రామా అని జీవిత సత్యం వివరించారు. ఈ లేఖను బండ్ల గణేష్ తదితరులు  షేర్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: