ఆదిపురుష్: డైలమాలో మేకర్స్.. ఏం జరుగుతుంది?

Purushottham Vinay
పాన్  ఇండియా స్టార్  యంగ్  రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్టుతో హిందీలో రూపొందుతున్న సినిమా ఆదిపురుష్.  సినిమా వచ్చే సంవత్సరం జనవరిలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా మొన్నటి వరకు ప్రకటించిన విషయం తెలిసిందే.దసరా, దీపావళి సందర్భంగా విడుదలైన పోస్టర్స్ లో ఇంకా టీజర్ లో జనవరి 12, 2023 సంవత్సరం లో సినిమా ను ప్రేక్షకుల ముందుకు ప్రపంచ వ్యాప్తంగా తీసుకు రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. కానీ గత రెండు మూడు రోజులుగా సినిమా వాయిదా పడబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభాస్ అభిమానులు ఆ వార్తలను కొట్టి పారేశారు. టాలీవుడ్ స్టార్ హీరో లు చిరంజీవి, బాలకృష్ణ  సినిమాలు ప్రేక్షకుల ముందుకు సంక్రాంతి కానుకగా రాబోతున్నాయి కనుక ఆ సినిమా లకు పోటీ వద్దు అనే ఉద్దేశంతోనే ఆదిపురుష్ సినిమా ను వాయిదా వేసి ఉంటారు అంటూ చాలా మంది మాట్లాడుకున్నారు. కానీ అవేవీ ప్రభాస్ అభిమానులు నమ్మలేదు.

తాజాగా చిత్ర యూనిట్ సభ్యులు డిస్ట్రిబ్యూటర్స్ కి సినిమా వాయిదా విషయమై సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమా సంక్రాంతికి విడుదల చేయడం వల్ల కలిసి వచ్చే అంశాల కంటే కష్టంగా మారే అంశాలు ఎక్కువగా ఉన్నాయని.. అందుకే సినిమా ను సంక్రాంతి కి కాకుండా వచ్చే సంవత్సరం సమ్మర్లో సోలో రిలీజ్ చేద్దాం అన్నట్లుగా చెప్పుకొచ్చారట. పైగా సినిమా కు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పెండింగ్ లో ఉందని.. విడుదల సమయానికి అది పూర్తి అవుతుందని నమ్మకం లేదని కూడా చిత్ర దర్శకుడు ఇంకా నిర్మాతలు బయ్యర్స్ తో మాట్లాడినట్లుగా తెలుస్తుంది. సినిమా రిలీజ్ విషయంలో వారు ఇంకా డైలామాలో ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. అందువల్ల ఈ వార్తలపై ప్రభాస అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ రేంజ్ లో రూపొందిన ఆదిపురుష్ సినిమా కేవలం తెలుగులో విడుదల కాబోతున్న సినిమాల వల్ల వాయిదా పడడం సిగ్గు చేటు అంటూ తీవ్ర వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు. ఆదిపురుష్ నిర్మాతల పద్ధతిపై ప్రభాస్ అభిమానులు అసంతృప్తితో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: