కాంతార ఇంత పెద్ద హిట్టవుతుందనుకోలేదు: రిషబ్ శెట్టి

Purushottham Vinay
అసలు ఎలాంటి అంచనాలు లేకుండ కేవలం చిన్న సినిమాగా విడుదలైన కన్నడ చిత్రం కాంతార దేశావ్యాప్తంగా కూడా చాలా పెద్ద సంచలన విజయం సాధించింది. మొదట కన్నడ నాట చిన్న సినిమాగా విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది.కన్నడతో పాటు తెలుగ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదలై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రికార్ట్‌ కలెక్షన్స్‌ రాబడుతోంది. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా నేషనల్‌ స్టార్‌గా గుర్తింపు పొందాడు హీరో రిషబ్‌ శెట్టి. ఈ మూవీకి ఆయనే దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.ఈ చిత్రంతో రాత్రికి రాత్రే ఆయన స్టార్‌డమ్‌ తెచ్చుకున్నాడు. దీంతో రిషబ్‌ శెట్టి గుగూల్‌ ట్రెండింగ్‌లో నిలిచాడు. ఇదిలా ఉంటే కాంతార మూవీతో కన్నడ కల్చర్‌ను దేశవ్యాప్తంగా పరిచయం చేశాడు రిషబ్ శెట్టి. భూతకోల సంస్కృతిని తెలియజేస్తూ ఈ కథను తెరకెక్కించాడు ఆయన. అయితే తాజాగా బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించిన రిషబ్‌ శెట్టి మూవీ విశేషాలను పంచుకున్నాడు.


ఈ సందర్భంగా ఈ సినిమా చివరిలో ఆయన వేసిన భూతకోల గురించి పలు ఆసక్తిర విషయాల గురించి చర్చించాడు. ఈ సినిమా చివరిలో ఆయన కోల వేసిన సంగతి తెలిసిందే.ఈ సన్నివేశం చేసేటప్పుడు ఆయన దాదాపు 50 నుంచి 60 కిలోల బరువు క్యారీ చేసినట్లు చెప్పాడు. 'భూతకోల సీక్వెన్స్‌ కోసం షూటింగ్‌ మొదలు 20 నుంచి 30 రోజుల ముందు నుంచి నాన్‌ వేజ్‌ తినడం మానేశా. దైవ కోల వేసినప్పుడు దాదాపు 50 నుంచి 60 కిలోల బరువును క్యారీ చేశాను. కన్నడ ప్రజలు అత్యంత పవిత్రంగా చూసే ఈ దైవ కోల అలంకారణ వేసిన అనంతరం కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తీసుకున్నాను. అయితే ఈ కోల సీక్వెన్స్‌ వేయడానికి ముందు ఆ తర్వాత ప్రసాదం ఇచ్చేవారు' అని రిషబ్‌ చెప్పుకొచ్చాడు.అసలు ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను ఊహించలేదని రిషబ్ శెట్టి అన్నాడు. ఇక కాంతార ప్రపంచవ్యాప్తంగా 280 కోట్లదాకా వసూళ్లు సాధించినట్లు సమాచారం తెలుస్తుంది. ఇక 300 కోట్ల వసూళ్లు సాధించేందుకు ఈ సినిమా కేవలం కొద్ది దూరంలోనే వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: