'కాంతార' క్లైమాక్స్ బోరింగ్.. సినిమా బాలేదు.. ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్..??

Anilkumar
కన్నడ స్టార్  హీరో  అయిన రిషబ్ శెట్టి హీరోగా ఆయన దర్శకత్వంలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 30 వ తేదీ థియేటర్లలో విడుదలైంది.అయితే కన్నడ చిత్ర పరిశ్రమలోఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా వివిధ భాషలలో కూడా విడుదల అయ్యి ఎంతో ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. కన్నడ స్టార్  హీరో  అయిన రిషబ్ శెట్టి ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది సినీ ప్రముఖులు సినిమాపై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.అయితే ఇక  తాజాగా ఓ నిర్మాత మాత్రం ఈ సినిమా పై స్పందిస్తూ 

సినిమా అసలు ఏ మాత్రం బాగోలేదని క్లైమాక్స్ చాలా బోరింగ్ గా ఉందంటూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే దేశవ్యాప్తంగా కాంతార సినిమాకి ప్రజలు సినీ ప్రముఖులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఈ క్రమంలోనే నిర్మాత అభిరూప్ బసు ఈ సినిమా గురించి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా అభిరూప్ మాట్లాడుతూ.. కాంతార సినిమా ప్రజల తెలివితేటలను అపహాస్యం చేసిందంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఈ సినిమా ప్రజల జీవితాల్లో దైవ జోక్యాన్ని విశ్వసించేలా చేస్తుందని తెలిపారు. 

 అయితే సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పాల్సి వస్తే కథ చాలా పేలవంగా తయారైందని ఈయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.కాగా ఈ సినిమాలో అసలు పాత్రకు ప్రామాణికత లేదు..ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఎంతోమంది మాట్లాడుతూ క్లైమాక్స్ ఎంతో అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చారు. అయితే  ఇక నాకు మాత్రం క్లైమాక్స్ ఏ మాత్రం నచ్చలేదని చాలా బోర్ అనిపించింది అంటూ అబిరూప్ తెలిపారు.ఇకపోతే  ఈ సినిమాని పాత స్టోరీ లైన్ తో కొత్తగా తీసారంటూ ఈయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ఈ సినిమా తనకు నచ్చలేదని చెప్పడంతో ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: