విశాల్ తో ప్రేమాయణం పై ఎట్టకేలకు నోరు విప్పిన హీరోయిన్..?

Anilkumar
సాధారణంగా నటీనటులు కాస్త సన్నిహితంగా మెలిగితే చాలు.. ఆ ఇద్దరి మధ్య ఏవో పప్పులు ఉడుకుతున్నాయనే వార్తలు పుట్టుకొచ్చేస్తాయి.అయితే అటువైపు వాళ్లు ధృవీకరించకముందే.. సదరు జంట పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతోందని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతోందంటూ కథనాలు రాసేస్తారు.ఇదిలావుండగా  లేటెస్ట్‌గా హీరో విశాల్‌పై కూడా అలాంటి రూమరే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.ఇక  నటి అభినయతో అతను ప్రేమలో ఉన్నాడని, త్వరలో పెళ్లి పీటలు కూడా ఎక్కబోతున్నారని ప్రచారం జరిగింది. కాగా 'మార్క్ ఆంటోనీ' సినిమాలో వీళ్లిద్దరు కలిసి నటిస్తున్నారని, 

ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, ఇప్పుడది పెళ్లిదాకా వెళ్తుందని వార్తలు వచ్చాయి.ఇకపోతే ఈ గాసిప్పులపై విశాల్ ఇంతవరకూ స్పందించలేదు కానీ, నటి అభినయ మాత్రం ఆ వార్తల్లో వాస్తవం లేదని తేల్చి చెప్పింది. కాగా తమ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ లేదని, మార్క్ ఆంటోనీ సినిమాలో ఆయనకు భార్యగా మాత్రమే తాను నటిస్తున్నానని స్పష్టం చేసింది. కాగా రీల్ లైఫ్‌లో భార్యగా నటించినంత మాత్రానా.. రియల్ లైఫ్‌లో భార్య కాగలమా? అని ఆమె తిరిగి ప్రశ్నించింది.ఇక  ఈ వివరణతో విశాల్, అభినయ మధ్య ప్రేమ ఉందనే రూమర్‌కి ఫుల్‌స్టాప్ పడినట్టయ్యింది.

  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన విశాల్‌పై ఇటువంటి రూమర్స్ రావడం ఇదేం తొలిసారి కాదు. అయితే ఇంతకుముందు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మీతో విశాల్ ప్రేమాయణం కొనసాగించాడంటూ తెగ ప్రచారం జరిగింది.ఇక వాళ్లు పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు కూడా అప్పట్లో జోరుగా వినిపించాయి.అయితే  తమ మధ్య ప్రేమ లేదని, కేవలం స్నేహితులం మాత్రమేనని ఎన్నిసార్లు స్పందించినా.. రూమర్లు మాత్రం ఆగలేదు.ఇకపోతే ఇంతలో విశాల్ హైదరాబాద్‌కు చెందిన అనిషాతో నిశ్చితార్థం చేసుకొని షాకిచ్చాడు.. పెళ్లి మాత్రం రద్దయ్యింది. ఇక ఇందుకు కారణం ఏంటో తెలీదు కానీ, నిశ్చితార్థం జరిగిన ఆరు నెలల తర్వాత వాళ్లు తమ పెళ్లిని రద్దు చేసుకున్నారు.  అయితే ప్రస్తుతం విశాల్ కేవలం సినిమాల మీద మాత్రమే ఫోకస్ పెట్టాడు.అంతేకాదు ప్రేమ, పెళ్లి వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: