కొత్త కారు కొన్న బిగ్ బాస్ షో బ్యూటీ హమీదా..!

murali krishna
ఈ మధ్య బుల్లితెర స్టార్స్.. వెండితెర స్టార్స్ ను మించిపోతున్నారు అని చెప్పొచ్చు. వాళ్లను మించి సంపాదిస్తున్నారు. లగ్జరీ లైఫ్ ను  బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
లగ్జరీ కార్లు కూడా కొంటున్నారు. రీసెంట్ గా బుల్లి తెర బ్యూటీ హమీదా కాస్ట్లీ కార్ ను సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ కార్ రేటెంత.
ఈ మధ్య వెండి తెర స్టార్స్ కంటే కూడా బుల్లి తెర స్టార్స్ ఎక్కువగా లగ్జరీ లైఫ్ నులీడ్ చేస్తున్నారు. అందులో భాగంగా..లగ్జరీ కార్లు కూడా కొనుగొలు చేస్తున్నారు. ఆమధ్య బిగ్ బాస్ బ్యూటీ హిమజ కూడా లక్షలు విలువ చేసిన కారును తన సొంతం చేసుకోగా.. ఇప్పుడు మరో బిగ్ బాస్ కంటస్టెంట్ హమీద కూడా లగ్జరీ కారు ను సొంతం చేసుకుంది. దీపావళి సందర్భంగా హమీద మెర్సిడెస్‌ బెంజ్‌ కారును కొనుగోలు చేసింది మరీ.ఈ మోడల్‌ కారు ధర .50 లక్షలకు పైగానే ఉంటుంది ఈ కారు
తన కొత్త కారు గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హమీదా..కొన్న వెంటనే తన పేరెంట్స్ మరియు తోటి కంటెస్టెంట్ యాంకర్‌ రవి, అతని భార్య నిత్య సక్సేనాతో జాలీగా ఓ రైడ్‌ కూడా వెళ్లింది మరీ. వీటికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ఇది చూసిన నెటిజన్లు. హమీద ఫ్యాన్స్‌ ఆమెను విష్ చేస్తూ రకరకాల కామెంట్లు కుడా పెడుతున్నారు.
ఇక అందరూ అనుకున్నట్టుగానే హమీదా పోస్టుకు సింగర్‌ శ్రీరామ్‌ కూడా  ఇలా స్పందించాడు. కంగ్రాట్స్‌ అంటూ కామెంట్‌ పెట్టాడు. దీనికి థ్యాంక్యూ అంటూ హమీదా రిప్లై ఇచ్చింది. ఈ క్రమంలో శ్రీరామ్‌తో డ్రైవ్‌కు ఎప్పుడు వెళ్తావ్‌ అంటూ నెటిజన్లు  గాటూఅయిన కామెంట్లు పెడుతున్నారు. ఈ విషయంలో మాత్రం ఇద్దరు స్పందించలేదు.
సాహసం చేయరా ఢింబకా సినిమాతో తెలుగు తెరపై హీరోయిన్ గా మెరిసింది హమీద. తెలుగుతో పాటు తమిళంలో ఒక సినిమాలోనూ చేసింది మరీ. కానీ హమీదాకు ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఈ క్రమంలో హమీదాకు బిగ్ బాస్ సీజన్ 5 లో అవకాశం వచ్చింది. బిగ్‌బాస్‌ షోతో కాస్త ఫేమస్ అయ్యింది హమీదా. బిగ్ బాస్ ఆమె జీవితాన్నే మార్చేసింది. కొత్త గుర్తింపును ఇచ్చింది.
ఇక బిగ్ బాస్ సీజన్‌ 5లో సింగర్‌ శ్రీరామ చంద్రతో హమీదా నడిపిన లవ్‌ ట్రాక్‌ ఆమెకు కాస్త  ఎక్కువగానే పాపులర్‌ చేసింది. యాంకర్‌ రవితో కలిసి ఆ షోలో రచ్చ చేసింది. అందుకే ఆ సీజన్‌ అయిపోయిన తరువాత కూడా ఓటీటీలో ప్రసారం అయిన బిగ్ బాస్ నాన్‌స్టాప్‌లో కూడా అవకాశం దక్కించుకుంది అని చెప్పొచ్చు. అక్కడ కూడా రచ్చ రచ్చ చేసింది బ్యూటీ. ఇక ఈరెండు సీజన్లలో మధ్యలోనే బయటకు వచ్చేసింది ఈ నటి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: