కాంతార: ఇంకా ఆగని రికార్డులు.. అప్పుడే ఓటిటి ఏందీ?

Purushottham Vinay
కన్నడం ఇండస్ట్రీలో పెద్ద బ్లాక్  బస్టర్  హిట్  అయిన కాంతార చిత్రం ప్రస్తుతం తెలుగు ఇంకా అలాగే హిందీ భాషల్లో కూడా భారీ వసూళ్లను నమోదు చేస్తుంది.ఈ శని ఆది వారాలు కూడా కాంతార సినిమా కలెక్షన్స్ అనేవి అసలు చాలా భారీగా ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతార సినిమాను హిందీ మరియు తెలుగు భాషల్లో కాస్త ఆలస్యం గా విడుదల చేయడం జరిగింది. ఇక్కడ భారీగా కలెక్షన్స్ నమోదు చేసిన ఈ సమయంలో కాంతార సినిమా ను ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది.ముందుగా అనుకున్న ప్రకారం నవంబర్ 5వ తేదీన ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్లాన్ చేస్తున్నారు. కానీ తెలుగు ఇంకా అలాగే హిందీ ప్రేక్షకులు ఇంకా థియేటర్లలోనే చూస్తున్న కారణంగా కన్నడంతో పాటు ఇతర భాషల వర్షన్లను కూడా ఓటీటీ ద్వారా స్ట్రీమింగ్‌ చేయడం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంతో నిర్మాతలు వెనక్కు తగ్గారు అంటూ ప్రచారం జరుగుతుంది.ఈ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.


అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ అనేది రావాల్సి ఉంది.మొత్తానికి కాంతార సినిమా  ఓటీటీ స్ట్రీమింగ్‌ అనేది ఇప్పుడు చాలా గందరగోళంగా ఉంది అంటూ ప్రచారం జరుగుతోంది.కన్నడ డైరెక్టర్  రిషబ్‌ శెట్టి హీరోగా నటించిన ఈ సినిమాకి మంచి స్పందన వచ్చింది.ఇప్పటికే వందల కోట్ల కలెక్షన్స్ నమోదు చేసిన ఈ సినిమా ఇక ఓటీటీ ద్వారా వస్తే రికార్డు స్థాయిలో ప్రేక్షకులు సినిమాను చూసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు. అయితే ఓటీటీలో చూడడానికి మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇదిలా ఉంటే కాంతార సినిమా USA లో వన్ మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించి సెన్సేషనల్ రికార్డ్ సాధించింది. అది కూడా కన్నడ వెర్షన్ కావడం విశేషం. ఇక ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన కాంతార 250 కోట్ల వసూళ్ల వైపు శరవేగంగా దూసుకువెళుతుంది. ఇక ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: