సింగర్ సునీత కూతురు కోసం అంత సాహసం చేయబోతుందా..?

murali krishna
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. ఒక సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె అందం విషయంలో కూడా అంతకుమించి ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.
నాలుగు పదుల వయసులో కూడా చక్కనైన కట్టుబొట్టు.. చీరకట్టుతో చూపరులను ఆకట్టుకుంటూ మరింతగా పాపులారిటీని పొందుతోంది. ఇక వైవాహిక జీవితంలో మొదట్లో ఎన్నో కష్టాలను అనుభవించి 19 ఏళ్లకే వివాహం చేసుకున్న సునీత.. ఒక కూతురు, కొడుకు జన్మించిన తర్వాత భర్తకు విడాకులు ఇచ్చి శాశ్వతంగా దూరమైంది. ఆ తర్వాత ఎన్నో అవమానాలను, సూటిపోటి మాటలను కూడా భరించింది. కానీ ఇటీవల 2020 డిసెంబర్లో మ్యాంగో వీడియో అధినేత రామ్ వీరపనేని ని వివాహం చేసుకున్న తర్వాత ఆమె జీవితం కాస్త మలుపు తిరిగిందని చెప్పాలి.
ప్రస్తుతం తన పిల్లలు , భర్తతో సంతోషంగా జీవిస్తోంది సునీత. ఈ క్రమంలోనే తన కెరియర్ పై దృష్టి పెట్టడమే కాకుండా తన పిల్లల భవిష్యత్తుపై కూడా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సునీత తన కూతురు కోసం పెద్ద సాహసం చేయబోతుందని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే .. సింగర్ సునీత కూతురు శ్రేయ nasa లో సైంటిస్ట్ అవ్వాలని కలలు కంటోందట. అందుకు తగ్గట్టుగానే శ్రేయ కూడా శ్రమిస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి . ఈ క్రమంలోనే ఎంత డబ్బైనా సరే ఖర్చుపెట్టి తన కూతురి కలను నెరవేర్చే ప్రయత్నం చేస్తుందట సునీత. ఈ విషయం తెలిసిన తర్వాత పలువురు నెటిజన్ లు, సునీత అభిమానులు అందరూ కూడా ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒక తల్లిగా బాధ్యతలు నెరవేర్చడం తప్పనిసరి అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ఇకపోతే సునీత ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి వెనుకాడడం లేదు కాబట్టి శ్రేయ కూడా తన కలను నెరవేర్చుకుంటే.. సినీ ఇండస్ట్రీ రంగానికి చెందిన వారసులు కూడా సైంటిస్టులుగా సాగిస్తున్నారు అనే ఒక బిరుదు అయిన దక్కుతుంది అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇక సింగర్ సునీత కెరియర్ విషయానికి వస్తే ఇటీవలే పొన్నియన్ సెల్వన్, గాడ్ ఫాదర్ సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్టుగా పనిచేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: