మరో బాలీవుడ్ హీరోయిన్ లైన్ లో పెట్టిన అట్లీ..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో అట్లీ ఒకరు. అట్లీ దర్శకుడి గా తన కెరియర్ ను రాజా రాణి మూవీ తో మొదలు పెట్టాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం తో అట్లీ కి అద్భుతమైన క్రేజీ లభించింది. రాజా రాణి మూవీ కేవలం తమిళ్ లో మాత్రమే కాకుండా తెలుగు లో కూడా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. దానితో అట్లే కి తమిళ్ తో పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత అట్లీ కోలీవుడ్ స్టార్ హీరో అయినటు వంటి దళపతి విజయ్ హీరోగా పోలీసోడు ,  అదిరింది , విజిల్ వంటి మూవీ లకు దర్శకత్వం వహించాడు.

ఈ మూడు మూవీ లు కూడా అద్భుతమైన విజయం సాధించడంతో అట్లీ క్రేజ్ కోలీవుడ్ ఇండస్ట్రీ లో అమాంతం పెరిగి పోయింది. ఇలా ఇప్పటి వరకు కెరియర్ లో దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తోనూ అద్భుతమైన విజయం అందుకున్న అట్లీ ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న జవాన్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. జవాన్ మూవీ లో షారుక్ ఖాన్ సరసన లేడీ సూపర్ స్టార్ నయన తార హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ప్రియ మణి ఈ మూవీ లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించ బోతుంది.

ఇలా ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్న అట్లీ మరో బాలీవుడ్ హీరో ను లైన్ లో పెట్టే పనిలో ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అట్లీ తన తదుపరి మూవీ ని బాలీవుడ్ స్టార్ హీరో లలో ఒకరు అయిన సల్మాన్ ఖాన్ తో తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ,  అందులో భాగంగా ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే అట్లీ తన తదుపరి మూవీ ని సల్మాన్ ఖాన్ తో తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: