ఆ పార్టీ టికెట్ ఇస్తే అక్కడి నుండి పోటీ చేస్తా... కంగనా రనౌత్..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీ మణులలో ఒకరు అయిన కంగనా రణౌత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో అనేక విషయాలపై స్పందిస్తూ కంగనా రనౌత్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే కంగనా రనౌత్ చాలా సంవత్సరాల క్రితం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏక్ నిరంజన్ అనే తెలుగు మూవీ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ తో కంగనా రనౌత్ తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది.

ఈ మూవీ ద్వారా  కంగనా రనౌత్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం  కంగనా రనౌత్ వరుస మూవీ లలో నటిస్తూ వస్తుంది. కొంత కాలం క్రితం  కంగనా రనౌత్ "తలైవి" అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ ప్రేక్షకుల నుండి ,  విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా కంగనా రనౌత్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే విషయంపై స్పందించింది.

తాజాగా  కంగనా రనౌత్ రాజకీయాలపై ఎంట్రీ ఇచ్చే విషయంపై స్పందిస్తూ ... తాజాగా కంగనా రనౌత్ తన రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చింది.  హిమాచల్ ప్రదేశ్ తన సొంత రాష్ట్రం కాగా ,  త్వరలో అక్కడ ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.  కంగనా రనౌత్ దీనితో బిజెపి పార్టీ కనుక , ఆ రాష్ట్రం లోని మండి నియోజక వర్గం టికెట్ ఇచ్చినట్లయితే అక్కడ నుండి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తాజాగా ప్రకటించింది. అక్కడి ప్రజలు మరియు బిజెపి పార్టీ తనను పోటీ చేయమని కోరుకుంటే దానిని గౌరవంగా భావిస్తాను అని కంగనా రనౌత్ చెప్పుకొచ్చింది. ఇలా తాజాగా కంగనా రనౌత్ రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: