సీక్వెల్స్ నామ సంవత్సరం 2023...!!

murali krishna
ఇటీవల హిట్ అయిన చాలా సినిమాలకి సీక్వెల్స్ ప్లాన్ చేస్తున్నారు. లేదా సినిమా చివర్లో సీక్వెల్ కి హింట్ ఇచ్చి సినిమాపై హైప్ తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం చాలా సీక్వెల్ సినిమాలు లైన్లో ఉన్నాయి. తమిళ్ స్టార్ హీరో కార్తీ అయితే వచ్చే సంవత్సరం అన్ని సీక్వెల్ సినిమాలనే లైన్లో పెట్టాడు. 2023 లో కార్తీ నుంచి 3 సీక్వెల్ సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోనవసరంలేదు.కార్తి నటించిన తమిళ హిస్టారిక్ ఫిక్షనల్ మూవీ ‘పొన్నియిన్’ సెల్వన్ తమిళ్ లో మంచి విజయం సాధించింది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం మలిచిన ఈ సినిమా తమిళ నాట రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. చోళ రాజుల వైభవాన్ని ఈ సినిమాతో దర్శకుడు కళ్ళకు కట్టినట్టు చూపించాడు. తెలుగులో అంతగా మ్యాజిక్ చేయనప్పటికీ తమిళుల్ని విశేషంగా ఆకట్టుకుంది సినిమా. ఇక దీనికి త్వరలోనే రెండో పార్ట్ ను వదలబోతున్నాడు మణిరత్నం. ఆల్రెడీ సెకండ్ పార్ట్ ను చాలా శాతం చిత్రీకరణ పూర్తి చేశారు. పార్ట్ 1లో కార్తి పాత్రకు మంచి పేరొచ్చింది. దీంతో పార్ట్ 2లో కూడా కార్తీకి ఎక్కువ స్కోప్ ఉండటంతో ఈ సినిమా నాకోసం ఎదురు చూస్తున్నారు కార్తీ అభిమానులు.
కార్తి మరో బ్లాక్ బస్టర్ మూవీ ‘ఖైదీ’ కి కూడా త్వరలో సీక్వెల్ తీయబోతున్నాడు దర్శకుడు లోకేష్ కనగరాజ్. త్వరలోనే సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు. తెలుగు, తమిళ్ లో భారీ విజయం సాధించిన ఈ సినిమాకి సీక్వెల్ గతంలోనే అనౌన్స్ చేయడంతో చాలా మంది సినీ లవర్స్ ఖైదీ 2 కోసం ఎదురు చూస్తున్నారు. ఖైదీ 2 కూడా 2023లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.ఇక తాజాగా దీపావళి కానుకగా విడుదలైన తమిళ డబ్బింగ్ మూవీ ‘సర్దార్’. కార్తి తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్ చేసిన ఈ సినిమాను ‘అభిమన్యుడు’ ఫేమ్ PS మిత్రన్ తెరకెక్కించాడు. ఇందులో కార్తి పోలీస్ గానూ, స్పై గానూ రెండు పాత్రలతో అదరగొట్టాడు. ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ తో రూపొందిన ఈ సినిమాకి తమిళంలోనూ, తెలుగులోనూ సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీపావళికి టాలీవుడ్ లో రిలీజైన స్ట్రైట్ మూవీస్ ను పక్కకు నెట్టి మంచి కలెక్షన్స్ తో సత్తా చాటుతోంది ‘సర్దార్’. రీసెంట్ గా ‘సర్దార్’ సినిమాకి సెకండ్ పార్ట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సీక్వెల్ కూడా వచ్చే సంవత్సరం షూటింగ్ జరుపుకోనుంది.
ఇక విక్రమ్ సినిమా కూడా కమల్ హాసన్ కి భారీ హిట్ ఇచ్చింది. ఇందులో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, సూర్య ఉన్నారు. అయితే విక్రమ్ సీక్వెల్ లో కార్తీ కూడా ఉంటాడు అని తెలుస్తోంది. దీంతో కార్తీ మరో సీక్వెల్ సినిమాలో కూడా ఉండనున్నాడు. మొత్తానికి 2023 కార్తీ అన్ని సీక్వెల్ సినిమాలతోనే రానున్నట్టు అర్ధమవుతుంది. అవి కూడా మంచి విజయం సాధిస్తే కార్తీకి మరింత ప్లస్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: