కాంతార: బాలీవుడ్ బాక్స్ ఆఫీసుని షేక్ చేస్తుందిగా?

Purushottham Vinay
ప్రపంచవ్యాప్తంగా కూడా కాంతార 200 కోట్లు వసూలు చేసి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఇక తెలుగులో కూడా కాంతారా దూకుడు కొనసాగుతుంది. మన తెలుగు వాళ్ళు ఒక రేంజిలో సినిమాని ఆదరిస్తున్నారు.రెండు వారాలు అవుతున్నా కాంతారా వసూళ్లు అదరగొడుతున్నాయి. తెలుగులో ఇప్పటికే 25 కోట్లు పైన కలెక్ట్ చేసిన కాంతార ఇక్కడ కూడా ఫుల్ రన్ లో రికార్డులు సృష్టించేలా ఉంది.ఇదే ఫాం ని బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కూడా కొనసాగిస్తుంది కాంతారా మూవీ. రెండో వారం లో కూడా కాంతార వసూళ్లు అదిరిపోతున్నాయి. హిందీ ఆడియన్స్ మరోసారి సౌత్ సినిమా కి బ్రహ్మరథం పడుతున్నారు. కాంతార సినిమా రెండో గురువారం 2.35 కోట్లు వసూళు చేసింది. బాలీవుడ్ లో కాంతార ఇప్పటివరకు 30 కోట్లు కొల్లగొట్టింది. ఓ పక్క బాలీవుడ్ సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర పేలవమైన ప్రదర్శన చూపిస్తుండగా సౌత్ సినిమాలు మాత్రం అక్కడ అసలు ఆగేదేలే అంటూ విజృంభిస్తున్నాయి.


ఇప్పటికే తెలుగు సినిమాలైన పుష్ప ఆర్.ఆర్.ఆర్ కార్తికేయ 2 kgf KGF2 వందల కోట్లతో బాలీవుడ్ స్టార్స్ కి కంటి మీద కునుకులేకుండా చేస్తుండగా లేటెస్ట్ గా కన్నడ మూవీ కాంతార కూడా రికార్డులు సృష్టిస్తుంది. అక్కడ ఈమధ్య రిలీజైన డాక్టర్ జి సినిమాని కూడా వెనక్కి నెట్టి కాంతార ముందుకు దూసుకెళ్తుంది.ఇప్పుడప్పుడే బాలీవుడ్ లో పెద్ద సినిమాలు కూడా ఏమి లేకపోవడం వల్ల కాంతార ఫుల్ రన్ లో బాలీవుడ్ లో రికార్డ్ నెంబర్ కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా నటించిన కాంతార సినీమ ప్రేక్షకులనే కాదు సినీ సెలబ్రిటీస్ ని కూడా ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇటీవలే సినిమా చూసిన ఇండియన్  సూపర్ స్టార్ రజినికాంత్ కూడా ఇదొక మాస్టర్ పీస్ అని అన్నారు. కంటెంట్ బాగుంటే ఎంతటి చిన్న సినిమా అయినా పెద్ద హిట్ అవ్వడం ఖాయమని కాంతార సినిమా మరోసారి నిరూపించింది. ఇంకా ఈ సినిమాకి ఎన్ని వసూళ్లు వస్తాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: