రాహుల్ గాంధీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన పూనమ్ కౌర్...!!

murali krishna
ప్రస్తుతం రాహుల్ గాంధీ తలపెట్టిన భారతదేశవ్యాప్త భారత జోడో యాత్ర తెలంగాణలో ఎంటర్ అయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం 52వ రోజు ఈ యాత్ర కొనసాగుతోంది. అయితే అనూహ్యంగా రాహుల్ గాంధీని వివాదాస్పద హీరోయిన్ పూనం కౌర్ కలిసి పలు ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. గతంలో కొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించిన పూనం కౌర్ ఎప్పటికప్పుడు వివాదాస్పద పోస్ట్ లు చేస్తూ సోషల్ మీడియాలో కలకలం రేపుతూ ఉంటుంది.
ఒకప్పుడు హీరోయిన్ గా తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేసిన పూనం కౌర్ ఆ సినిమాలు ఆడక పోవడంతో సినిమాలకు కాస్త దూరమైంది. ఇటీవల నాతిచరామి అనే సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ప్రస్తుతం ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని రెండు మూడు సినిమాలు చేశారు. ఇక మరోపక్క ఆమె ఏపీలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా పూనం కౌర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారటా..
ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ పూనం కౌర్ తో మాట్లాడుతూ ఖాదీ వస్త్రాలకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉందని గాంధీజీ ధరించిన వస్త్రాలు కూడా చేనేత వస్త్రాలే అని పేర్కొన్నారట. ఈ సందర్భంగా పూనం కౌర్ నేతల కోసం కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేయాలని కోరగా కచ్చితంగా చేస్తుందని, మా అమ్మ కూడా చేనేతలను వేసిన చీరే కడుతుందని రాహుల్ గాంధీ పేర్కొనడమే గాక మీరు మా అమ్మను చెల్లిని ఒకసారి కచ్చితంగా కలవండని కూడా కోరినట్లు తెలుస్తోంది.
అంతేకాక సోనియాగాంధీని కల్పించే బాధ్యతను అప్పటికప్పుడే రాహుల్ గాంధీ పార్టీ నాయకులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంపై స్పందించిన పూనం కౌర్ రాహుల్ గాంధీతో 15 నిమిషాల్లో మాట్లాడానని చేనేత కార్మికులు, మహిళా సమస్యలపై చర్చించానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పప్పు కాదు సమస్యలను బాగా అధ్యయనం చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వినతిపత్రాలు కూడా ఇవ్వగానే అవి చదివిన తరువాత మనతో మాట్లాడుతున్నారని ఆమె పేర్కొన్నారు.
త్వరలోనే తన తల్లిని చెల్లిని కలవాలని రాహుల్ గాంధీ కోరారని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలపై రాష్ట్ర జీఎస్టీ తగ్గించాలని కోరిన ఆమె తనకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని సమస్యల మీద మాత్రం పోరాటం చేస్తానని పేర్కొన్నారు. మునుగోడు ఎన్నికల నేపథ్యంలో పద్మశాలీలు ఆలోచించి ఓటెయ్యాలని కోరిన ఆమె మునుగోడులో చేనేతల మంచి కోసం పనిచేసే వారికి ఓటేయాలని కోరారట.. అధికార పార్టీ చేనేత వస్త్రాలపై రాష్ట్ర జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేయాలని కోరిన ఆమె చేనేత సమస్యలపై రాహుల్ గాంధీని పార్లమెంట్ లో కూడా మాట్లాడమని కోరినట్లు వెల్లడించారట

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: