వావ్ : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు శుభవార్త..!!

murali krishna
RRR వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరుకు ఎలాంటి సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొనకపోవడం తో ఆయన అభిమానులు తీవ్రమైన నిరాశలో ఉన్న విషయం మన అందరికి తెలిసిందే..ఒకానొక దశలో అసలు ఎన్టీఆర్ సినిమాలు మానేస్తున్నాడా అనే సందేహం కూడా అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో కలిగింది.
కొరటాల శివ తో తన తదుపరి చిత్రం ఉంటుంది అని ఇది వరకే ప్రకటించిన ఎన్టీఆర్ ఇప్పటి వరుకు ఆ సినిమాకి సంబంధించి కనీసం పూజ కార్యక్రమం కూడా చెయ్యకపోవడం తో అభిమానుల సహనం కి పరీక్ష పెట్టినట్టు అయ్యింది..ఎన్టీఆర్ నుండి సోలో మూవీ వచ్చి దాదాపుగా నాలుగేళ్లు అవుతుంది..#RRR లో ఎన్టీఆర్ పాత్ర పట్ల కూడా అన్యాయం జరిగింది అనే బాధలో ఉన్నారట.
ఒక విధంగా చెప్పాలంటే #RRR సక్సెస్ ని వాళ్ళు సంపూర్ణంగా ఆస్వాదించలేకున్నారు అనే చెప్పాలి..ప్రస్తుతం వారి ఆశలన్నీ ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ మీదనే..ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్ కి ఇప్పుడు ఇండస్ట్రీ లో ప్రచారం అవుతున్న ఒక వార్త కాస్త ఊరటని కలిగిస్తుందట.
ఇక అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ - కొరటాల సినిమాకి సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి అట..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని కూడా ఖరారు చేసినట్టు వార్తలు కూడా వినిపిస్తున్నాయి..నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి కెరీర్ లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన 'ఆ ఒక్కటి అడక్కు' అనే టైటిల్ ని ఈ సినిమాకి కొరటాల శివ ఖరారు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ పుట్టినరోజునాడు విడుదల చేసిన వీడియో గ్లిమ్స్ కి ఇప్పుడు వినిపిస్తున్న ఈ కామెడీ టైటిల్ కి అసలు సంబంధమే లేదే అని ఫాన్స్ కి అనిపించడం సహజం..ఎందుకంటే అప్పుడు అనుకున్న కథ వేరు..ఇప్పుడు అనుకున్న కథ వేరట..ఆ కథ కి సెకండ్ హాఫ్ సరిగా రాకపోవడం తో వేరే కథ ని సిద్ధం చెయ్యమని ఎన్టీఆర్ చెప్పాడని తెలుస్తుంది.
ఎన్టీఆర్ సూచనల మేరకే ఒక సరికొత్త టీం తో కలిసి ఈ లేటెస్ట్ వెర్షన్ ని రాసుకున్నారట..ఈ వెర్షన్ ఎన్టీఆర్ కి కూడా బాగా నచ్చినట్టు సమాచారం..వచ్చే ఏడాది ప్రారంభం లోనే ఈ సినిమా షూటింగ్స్ పట్టాలెక్కనుంది అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: