2022 లో హిందీలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసిన 5 సౌత్ ఇండియన్ సినిమాలు ఇవే..!

Pulgam Srinivas
2022 వ సంవత్సరంలో ఇప్పటివరకు సౌత్ సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ విజయాలను కూడా సాధించాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం సౌత్ నుండి విడుదల అయ్యి హిందీ వెర్షన్ లో అత్యధిక గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసిన 5 మూవీ ల గురించి తెలుసుకుందాం.

యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కే జీఎ ఫ్ చాప్టర్ 2 మూవీ హిందీ వర్షన్ 434.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ హిందీ వర్షన్ 274.31  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా నటించగా ,  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లో అజయ్ దేవగన్ ,  శ్రేయ ,  సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటించగా ,  ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు.

రిషబ్ శెట్టి హీరోగా మరియు దర్శకత్వం వహించిన కాంతారా మూవీ హిందీ వర్షన్ 31.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ హిందీ వర్షన్ కి ప్రస్తుతం కూడా అద్భుతమైన కలెక్షన్ లు లభిస్తున్నాయి.  

నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ హిందీ వర్షన్ 31.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పోన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ హిందీ వర్షన్ 22.37 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. పోన్నియన్ సెల్వన్ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి ,  ఐశ్వర్య రాయ్ ,  త్రిష ముఖ్య పాత్రలలో నటించగా ,  ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: