ప్రభాస్ తో ఫైట్ ఎందుకుని ప్రక్కకు తప్పుకున్న స్టార్ హీరో !

murali krishna
ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతోందంటే మిగతా హీరోలు తమ సినిమాలను మొహమాటం లేకుండా ప్రక్కన పెట్టేస్తున్నారు. అతనితో పోటి ఎందుకునే పరిస్దితి ఏర్పడింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆ విషయం బాగా కనపడుతోంది.ప్రభాస్ కు ఇప్పుడు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. హిట్, ఫ్లాఫ్ లతో సంభందం లేకుండా ఆయన సినిమాలు కలెక్ట్ చేస్తున్నాయి. భారీ ఎత్తున రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ప్రభాస్ కు అభిమానులు బాగా పెరిగారు. ఈ నేపధ్యంలో ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతోందంటే మిగతా హీరోలు తమ సినిమాలను మొహమాటం లేకుండా ప్రక్కన పెట్టేస్తున్నారు. అతనితో పోటి ఎందుకునే పరిస్దితి ఏర్పడింది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఆ విషయం బాగా కనపడుతోంది. తాజాగా ప్రభాస్ సలార్ కు చోటు ఇస్తూ ఓ స్టార్ హీరో తన సినిమా రిలీజ్ డేట్ మార్చుకునే వార్త ప్రభాస్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్‌తో పాటు దక్షిణాది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం సలార్‌. రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా కేజీఎఫ్‌ ఫేం ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) పాన్‌ ఇండియా స్థాయిలో ఈ యాక్షన్‌ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ ఇప్పటికే ఖరారైంది. సెప్టెంబర్‌ 28,2023న ప్రపంచవ్యాప్తంగా సలార్‌ను విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్‌ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇదే రోజు మరో బాలీవుడ్ భారీ చిత్రం బాక్సాఫీస్‌ బరిలోకి దిగనుంది. అదే హృతిక్‌ రోషన్‌ (HrithiK Roshan) నటిస్తోన్న `ఫైటర్‌`. గతంలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశారు.
కాగా ఫైటర్‌ సినిమాకు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా, అనిల్‌ కపూర్‌ కీ రోల్‌ పోషిస్తున్నాడు. ప్రముఖ హాలీవుడ్ నటీనటులు ఈ క్రేజీ ప్రాజెక్టులో నటిస్తున్నారని తెలుస్తోంది. కాగా రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరోవైపు ప్రభాస్‌ సలార్‌ బడ్జెట్‌ కూడా రూ.200 కోట్లకు పైగానే.  ఈ రెండు భారీ యాక్షన్‌ సినిమాలు ఒకేరోజు తలపడడం చర్చనీయాంశమైంది.  సోషల్ మీడియాలో కూడా దీనిపైనే చర్చ నడిచింది. అయితే అనుకోని విధంగా హృతిక్ రోషన్ వెనుతిరిగారు. తన చిత్రం రిలీజ్ డేట్ మార్చుకున్నారు. ఈ సినిమా తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ నుంచి జనవరి 25కు మారింది.  ఫైటర్ పక్కకు జరగడంతో ఇక సలార్‌కి లైన్ క్లియర్ అయ్యింది. ఈ సినిమా దేశ వ్యాప్తంగా సోలో రిలీజ్ కానుంది. దీంతో అటు నార్త్ నుంచే కాకుండా ఇటు సౌత్ నుంచి కూడా ఓపెనింగ్స్ ఓ రేంజ్‌లో వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తోంది.
 ఉగ్రం అనే కన్నడ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్.. కెజియఫ్ సినిమాతో తనేంటో చూపించాడు. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈయన కోసం చూస్తున్నారు స్టార్ హీరోలు. కెజియఫ్ 2 విడుదలకు ముందే ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో సలార్ లాంటి మరో సెన్సేషనల్ ప్రాజెక్టుకు తెరతీసాడు ప్రశాంత్ నీల్.  సలార్ అంటే కమాండర్ ఇన్ చీఫ్ అని అర్థం చెప్పాడు ఈ దర్శకుడు. తన సినిమాలో గ్రూపులో కుడిభుజంలా ఉండేవాడు.. లీడర్ ఎలా అయ్యాడు అనేది కథ అని చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు ప్రభాస్‌ను ఎవ్వరూ చూపించని స్థాయిలో.. అంత పవర్ ఫుల్‌గా ఇందులో చూపించబోతున్నట్లు తెలిపాడు ప్రశాంత్ నీల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: