జటిరత్నలు హీరోయిన్ న్యూ లుక్ మాములుగా లేదుగా..!!

murali krishna
కొప్పు బాగుండాలే కానీ జుట్టు ఎలాగైనా వేసుకోవచ్చు. అలాగే ఎత్తు, దానికి తగ్గట్టు రంగు, శరీర సౌష్టవం ఉండాలి కానీ కుర్రకారు గుండెల్లో సెగలు రేపొచ్చు.
ప్రస్తుతం చిట్టి అలియాస్ ఫరియా అబ్దుల్లా అలానే చేస్తోంది మరీ. జాతి రత్నాలు సినిమా తర్వాత ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు ఇప్పుడు వరుస అవకాశాలు వస్తుండడంతో ఊపిరి సలపకుండా సినిమాలు  తెగ చేస్తోంది. తాజాగా ఫరియా అబ్దుల్లా చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో  బాగా హల్ చల్ చేస్తోంది. ఇన్నాళ్లు సంప్రదాయమైన దుస్తుల్లో కనిపించిన ఫరియా.. సైమా అవార్డుల వేడుక నుంచి అందాల గేట్లు ఒక్కసారిగా ఎత్తింది.
జాతి రత్నాలు సినిమా తర్వాత ఫరియా ఏ సినిమా కూడా ఒప్పుకోలేదు. కొంచెం గ్యాప్ తర్వాత నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్లో వచ్చిన బంగార్రాజు సినిమాలో టైటిల్ సాంగ్ లో ఆడి పాడింది ఈ బ్యూటీ. నాగ చైతన్యకు, నాగార్జునకు దీటుగా స్టెప్పులు వేసి అందరినీ అలరించింది. ఈమె ఒడ్డు, పొడవు చూసి మేర్లపాక గాంధీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. త్వరలో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరు అందుకున్నాయి. ఈ క్రమంలో ఆలీ నిర్వహించిన ఓ టాక్ షో లో ఫరియా, సినిమా హీరో సంతోష్ శోభన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు చిట్టి ఏమాత్రం తడవకుండా సమాధానం చెప్పింది. బెల్లీ డాన్స్ లో చిత్ర విచిత్రమైన స్టెప్పులు వేసి ఆలికి చుక్కలు చూపించింది అంటా ఈ హీరోయిన్.
ఫరియా ను చూస్తే మన ఇంటి పక్కింటి అమ్మాయిల గా కనిపిస్తుంది. జాతి రత్నాలు సినిమాలోనూ అనుదీప్ ఆమె పాత్రను అదే విధంగా మలిచాడు అని మనం చెప్పవచ్చు. కానీ తర్వాత వచ్చిన అవకాశాలను సరిగా వద్దు అనుకుంది. సరైన కథాబలం లేకపోవడమే ఇందుకు కారణమని ఆమె పలు ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే ఆ మధ్య బెంగళూరులో నిర్వహించిన సైమా అవార్డు ఫంక్షన్లో ఈషా రెబ్బ తో కలిసి చిందులు వేసింది. ఆ తర్వాత మేర్లపాక గాంధీ సినిమాకు ఓకే చెప్పింది.
ఈ సినిమాలో ఆమె అల్ట్రా మోడ్రన్ గర్ల్ గా కనిపించనుంది. తర్వాత రవితేజ హీరోగా వస్తున్న రావణాసుర సినిమాలోనూ ఫరియా నటిస్తోంది. ఇందులో భాగంగా ఇటీవల తాను నిర్వహించిన ఫోటోషూట్ ఫరియా లోని కొత్త యాంగిల్ ను యూత్ కు పరిచయం చేసింది ఈ నటి. మత్తెక్కించే తన కళ్ళకు ఫ్లాష్ వేయడంతో మరింత కైపు ఎక్కిస్తున్నాయి. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న కాస్ట్యూమ్.. ఆమెను దేవకన్య లాగా మార్చేశాయి. ఇలా చెప్పుకుంటూ పోవాలి కానీ ఫరియా అందం వర్ణనకు అందదు. తెలుగు చిత్ర పరిశ్రమను ఏలే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయంటున్న ఫరియా.. మునుముందు ఎటువంటి సంచలనాలకు నాంది పలుకుతుందో వేచి చూడాల్సిందే మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: