విజయ్ దేవరకొండ... గౌతమ్ తిన్ననూరి మూవీని నిర్మించనున్న ఆ క్రేజీ నిర్మాత..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా మంచి గుర్తింపు ను దక్కించుకున్న వారిలో గౌతమ్ తిన్ననూరి ఒకరు. గౌతమ్ తిన్ననూరి , సుమంత్ హీరోగా తెరకెక్కిన మళ్ళీ రావా మూవీ తో మంచి విజయాన్ని అందుకొని మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈ దర్శకుడు నాచురల్ స్టార్ నాని హీరోగా క్రికెట్ నేపథ్యంలో జెర్సీ అనే మూవీ ని తెరకెక్కించాడు. జెర్సీ మూవీ మంచి విజయం సాధించడంతో పాటు , మంచి కలెక్షన్ లను రాబట్టింది.

అలాగే జెర్సీ మూవీ కి గాను ఈ దర్శకుడికి ప్రేక్షకుల నుండి ,  విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో జెర్సీ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో , ఈ మూవీ ని జెర్సీ పేరు తోనే హిందీ లో షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన హిందీ జెర్సీ మూవీ బాలీవుడ్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. జెర్సీ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలు అయినప్పటికీ ఈ మూవీ కి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇది ఇలా ఉంటే గౌతమ్ తిన్ననూరి ఇప్పటి వరకు కెరియర్ లో తక్కువ సినిమాలకే దర్శకత్వం వహించినప్పటికీ చాలా క్రేజ్ ను మాత్రం సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే గౌతమ్ తిన్ననూరి తన తదుపరి మూవీ ని టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ ,  గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్క బోయే మూవీ కి దిల్ రాజు నిర్మాత గా వ్యవహరించే అవకాశం ఉంది అంటూ ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ ,  శివ నిర్మాణ దర్శకత్వం లో సమంత హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఖుషి అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: