ఓటీటీ లోకి వచ్చేసిన పొన్నియన్ సెల్వన్.. కానీ వారికి మాత్రమే..!

Divya
డైరెక్టర్ మణిరత్నం కలల ప్రాజెక్టు పొన్నియన్ సెల్వన్ సినిమా ఎట్టకేలకు సెప్టెంబర్ 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్ , కన్నడ, హిందీ, మలయాళం భాషలలో విడుదలయి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. అంతేకాదు సుమారుగా రూ. 500 కోట్ల వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు కూడా చెబుతున్నాయి. కల్కి కృష్ణమూర్తి రాసిన నవల ఆధారంగా రెండు భాగాలుగా రూపొందించారు. ఈ సినిమాను అయితే మొదటి భాగం విడుదల చేయగా రెండో భాగం త్వరలోనే విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.
ఇదిలా ఉండగా థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.  కానీ కొన్ని వర్గాల వారికి మాత్రం నిరాశ మిగిల్చింది ఈ సినిమా అని చెప్పవచ్చు. అయితే అసలు విషయంలోకెళితే థియేటర్లలో సందడి చేసిన ఏ సినిమా ఇప్పుడు ఓటిటిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోగా .. అక్టోబర్ 28 మిడ్ నైట్ నుండి స్క్రీనింగ్ అవుతుందని స్పష్టం చేశారు. అయితే అది కూడా కేవలం పే - పర్ వ్యూ లోనే అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం యూజర్లు పొన్నియన్ సెల్వన్ సినిమా చూడాలంటే రూ. 199 చెల్లించాలి.

కానీ నవంబర్ 4 నుంచి ప్రైమ్ యూజర్ లందరికీ ఉచితంగా చూడవచ్చని అమెజాన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, జయం రవి, కార్తీక్ ప్రధాన పాత్రను పోషించగా.. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ , మద్రాస్ టాకీస్ బ్యానర్లవారు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. మరి థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఓటిటిలో ఏ విధంగా విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: