నష్టాల్లో ఉన్న ' గాడ్ ఫాదర్ ' మూవీ...!!

murali krishna
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు మంచి టాకే వచ్చింది. దసరా ఫెస్టివల్ కూడా కలిసి వచ్చింది. లాంగ్ వీకెండ్ దొరికింది. అయితే సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్.. కొల్లగొట్టిన కలెక్షన్లకు సంబంధం లేకుండా పోయింది. అయితే ఈ సినిమాకు మొదటి వీకెండ్ అంతో ఇంతో బాగానే వచ్చాయి. వచ్చిన కలెక్షన్లకు మేకర్స్ రిలీజ్ చేస్తోన్న అఫీషియల్‌ లెక్కలకు ఎంతో తేడా ఉందని ట్రేడ్ వర్గాలు చెవులు కొరుక్కున్నాయి.అయితే రెండో వారం గాడ్ ఫాదర్ సినిమాకు ఎలాంటి ఎదురుండదని అంతా అనుకున్నారు. అన్నీ చిన్న చిత్రాలే కదా? అని భావించారు. కానీ అల్లు అరవింద్ మాత్రం కాంతారా సినిమా దెబ్బ కొట్టేశాడు. కాంతారా సినిమా నేటికీ ఇంకా ఆడుతోంది. హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. అలా కాంతారా సినిమా ప్రభావం గాడ్ ఫాదర్ మీద పడింది. కాంతారా దెబ్బకు గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్లు పడిపోయాయి. ఆఖరికి దీపావళి సీజన్లోనూ కాంతారా సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.
ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్లు చూస్తుంటే భారీ స్థాయిలోనే నష్టం వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమా దగ్గరదగ్గరగా 55 కోట్లకు పైగా షేర్ సాధించినట్టు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం దాదాపు 90 కోట్ల వరకు బిజినెస్ చేసింది. ఈ లెక్కన చూస్తుంటే దాదాపు 35 కోట్ల వరకు నష్టాన్ని తెచ్చిపెట్టినట్టు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమా బ్రేక్ ఈవెన్ టచ్ చేయడం అసాధ్యంగానే మారేట్టు కనిపిస్తోంది.
మూడోవారంలోకి వచ్చిన తరువాత కూడా గాడ్ ఫాదర్ సినిమా ముందు పెద్ద టార్గెట్ ఉంది. ఇంకా ముప్పై ఐదు కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. చూస్తుంటే గాడ్ ఫాదర్ బ్రేక్ ఈవెన్ అయ్యేట్టుగా కనిపించడం లేదు. ఆచార్య ఫ్లాప్ టాక్‌తో భారీ నష్టాల్నీ తెస్తే.. గాడ్ ఫాదర్ పాజిటివ్ టాక్‌తోనూ నష్టాల్ని తెచ్చి పెట్టేసింది.ఇక సంక్రాంతి బరిలో చిరంజీవి దిగబోతోన్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాతో బాబీ తన అభిమాన హీరో చిరంజీవి మాస్ మూల విరాట్టుగా చూపించాడు. ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ మీద గురి పెట్టేసింది. మరి ఈ చిత్రమైనా లాభాల బాట పడుతుందా? లేదా?అన్నది చూడాలి.
నోట్: ఈ సమాచారాన్ని వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సేకరించినది, దీన్ని  జీ తెలుగు న్యూస్ ధృవీకరించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: