' యశోద ' మూవీ హిట్ అయినట్లే?ఇదే ప్రూఫ్..

Satvika
హీరోయిన్ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది..ఇప్పుడు ఆమె మెయిన్ రోల్ లో డైరెక్టర్స్ హరి- హరీష్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం యశోద. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ పై మరింత ఆసక్తిని కలిగిస్తోంది..ఇందులో సామ్ గర్భవతిగా కనిపించింది. నీకు ఎప్పుడైనా రెండు గుండె చప్పుళ్లు వినిపించాయా ? అంటూ సామ్ చెప్పే డైలాగ్‏తో ప్రారంభమైయ్యింది ట్రైలర్. డబ్బు కోసం గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళగా సమంత నటించినట్లుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అంటే సరోగసి ప్రెగ్నెన్సీ.. తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళల నేపథ్యంలో యశోద ఉండనున్నట్లు తెలుస్తోంది.

సరోగసి కోసం తమ గర్భాన్ని అద్దెకు ఇచ్చే మహిళలు అంతా ఒక్కచోట ఉండడం.. ఆ తర్వాత వారికి అక్కడ ఏదో జరగడం ఆద్యంతం ఆసక్తిని కలిగిస్తోంది. ఆ మహిళలకు ఏం జరుగుతుంది.. హత్యలు.. ఆ మహిళల కోసం యశోద పోరాటంతో ట్రైలర్ కట్ చేశారు. యశోద ఎవరో తెలుసు కదా ?..ఆ కృష్ణ పరామత్ముడిని పెంచిన తల్లి అంటూ సామ్ చెప్పే డైలాగ్స్ ఆద్యంతం క్యూరియాసిటీని పెంచుతున్నాయి..వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ కీలకపాత్రలలో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇకపొతే..ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ ట్రైలర్ ను తెలుగులో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, హిందీలో వరుణ్ ధావన్, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్ విడుదల చేశారు.ఈ సినిమా తో పాటు..సామ్ నటించిన శాకుంతలం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు సామ్.. విజయ్ దేవరకొండ జంటగా నటిస్తోన్న ఖుషి చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: