రిశబ్ శెట్టి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా..!!

murali krishna
 హీరో కమ్‌ డెరెక్టర్‌ రిషబ్‌ శెట్టి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. గతంలో చాలా సినిమా ల్లో హీరోగా నటించి దర్శకత్వం వహించినప్పటికీ రాని గుర్తింపు ఒక్క కాంతారాతోనే నేషనల్‌ లెవెల్లో బరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రిషబ్ శెట్టి
ప్రస్తుతం ఎక్కడ చూసినా అతని గురించే చర్చ. సోషల్‌ మీడియాలోనూ రిషబ్‌ పేరు హోరెత్తిపోతోంది అని చెప్పొచ్చు. అతని నేపథ్యం ఏంటి? పర్సనల్‌ లైఫ్‌ గురించి నెట్టింట్లో తెగ సెర్చ్‌ చేస్తున్నారు. ఈక్రమంలో రిషబ్‌ శెట్టి ప్రేమ వివాహానికి సంబంధించి కొన్న ఆసక్తికర విషయాలు ఇలా వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే.. రిషబ్‌ సతీమణి పేరు ప్రగతి. వీరిది ప్రేమ వివాహం. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక రిషబ్‌ ప్రేమ కథ విషయానికొస్తే.. 2016లో రక్షిత్‌శెట్టి హీరోగా ఓ ను తెరకెక్కించాడు కాంతారా హీరో. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రక్షిత్‌ వీరాభిమాని ప్రగతి కూడా  ఈ ఈవెంట్ కిహాజరైంది. అక్కడే ప్రగతిని మొదటిసారి చూశాడట రిషబ్‌. తనను ఇదివరకు ఎక్కడో చూసినట్టు ఉందే అనుకుంటూ ఏకవటీ ఇంటికి వెళ్లిపోయాడట మరీ. ఆమె గురించే ఆలోచిస్తూ.. ఫేస్‌బుక్‌ తెరిచాడట. అప్పటికే అందులో ఆమె ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ కనిపించిందట. దాదాపు ఏడాది క్రితమే రిషబ్‌కి ప్రగతి ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపించిందట. కానీ పనుల్లో ఉండి రిషబ్‌ పెద్దగా పట్టించుకోలేదట మరీ .
అయితే ఎప్పుడైతే ఈవెంట్‌లో చూశాడో వెంటనే ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్‌ చేశాడట రీషబ్. అది మొదలు అప్పటి నుంచి వీరిద్దరి మధ్య చాటింగ్‌, ఫోన్‌కాల్స్ మొదలయ్యాయి. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. క్రమంగా ఆ స్నేహం కాస్త ప్రేమగా చిగురించింది. ఇక పెళ్లితో తమ బంధాన్ని మరింత శాశ్వతం చేసుకోవాలనుకున్నారు ఈ నటుడు. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్‌ ఇచ్చారు ప్రగతి కుటుంబ సభ్యులు. అదేంటంటే..రిషబ్‌ది బ్యాక్‌గ్రౌండ్‌ కావడం, అప్పటికీ పెద్దగా గుర్తింపు రాకపోవడం, లైఫ్‌లో ఇంకా సెటిల్డ్‌ కాలేదనే ఉద్దేశంలో ఈ పెళ్లికి నిరాకరించారట మరీ. కానీ ప్రగతి పట్టుబట్టి మరీ కుటుంబ సభ్యులను ఒప్పించిందట. అలా పెద్దల ఆశీర్వాదంతో 2017లో  వీరు పెళ్లిపీటలెక్కారీ లవ్లీ కపుల్‌ గా మారారు. వీరి ప్రేమ బంధానికి గుర్తింపుగా ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: