మరో కాంట్రవర్సీ లో ఇరుక్కున్న నటి తాప్సి..!!

murali krishna
గత కొద్దిరోజులుగా హీరోయిన్ తాప్సీ ఎక్కువగా కాంట్రవర్సీ వార్తలలో నిలుస్తుంది అని చెప్పొచ్చు. ఇటీవల ఆమె నటించిన దొబెరా ప్రమోషనల్లో పాల్గొన్న సమయంలో ఫోటోగ్రాఫర్లకు ..
ఆమెకు మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది అంటా మరి. తాజాగా మరోసారి ఆమె ఓ ఫోటోగ్రాఫర్ పై మండిపడింది. అలా చేయొద్దంటూ ఏకంగా అతడికి వార్నింగ్  కూడా ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది. బుధవారం తాప్సీ కారులోకి ఎక్కి డోరు మూయటానికి ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఓ ఫోటోగ్రాఫర్ ఆమెను డోర్ మూయకుండా అడ్డుకుంటూ చేత్తో డోర్ ఆపి ఉంచాడు అంటా. దీంతో ఆమెకు కోపం వచ్చింది. అలా చేయోద్దు అంటూ పెద్దా వార్నింగ్ ఇవ్వడంతో అతను డోర్ వదిలిపెట్టాడు. అనంతరం అక్కడి నుంచి తాప్సీ వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను సెలబ్రెటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ తన ఇన్ స్టాలో షేర్ చేయగా ఆ వీడియో ఇప్పుడు బాగా వైరలవుతుంది. తాప్సీ తీరుపై నెటిజన్స్  బాగానేఫైర్ అవుతున్నారు అని చెప్పొచ్చు.
ఇండస్ట్రీలోకి మరో జయా బచ్చన్ వచ్చేసింది.. ఆమెకు అంతగా ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు ? అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. తాప్సీ ఇలా ఫోటోగ్రాఫర్లతో గొడవ పడడం ఇది మొదటి సారి కాదు. గతంలో ఆమె నటించిన దొబెరా ప్రమోషనల్లో ఫోటోగ్రాఫర్లకు.. తాప్సీకి మధ్య తీవ్రస్తాయిలో మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత ఇదే కు నెగిటివ్ రివ్యూలు వచ్చాయంటూ ఓ విలేకరి అడగ్గా.. అతడిపై తాప్సీ మండిపడింది. మీతో ఎలా ప్రవర్తించిన నటీనటులను చెడు ప్రవర్తన కలిగిన వారు అనేస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. ప్రతి కు పాజిటివ్, నెగిటివ్ రివ్యూ ఉంటుందని తాప్సీ చెప్పుకొచ్చింది. అలాగే ఇటీవల హీరోయ ఆయుష్మాన్ ఖురానా నిర్వహించిన దీపావళి పార్టీలో సైతం తాప్సీ కెమెరామెన్స్ తో గొడవపడింది.
చాలాకాలంగా తెలుగు ఇండస్ట్రీకి ఈ ముద్దుగుమ్మ దూరంగా ఉంటుంది మరీ. మిషల్ ఇంపాజిబుల్ చిత్రంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ అంతగా ఆకట్టుకోలేకపోయింది ఈ బ్యూటీ. ప్రస్తుతం హిందీలో వరుస లతో  చాలా బిజీగా ఉంది తాప్సీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: