త్వరలో ఆ టాలీవుడ్ నటి పెళ్లి అంటా మరీ..!!

murali krishna
నటి వర్ష బొల్లమ్మ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోందట మరీ అది కూడా ఓ సీనియర్‌ బడా ఇంటికి కోడలిగా వెళ్లబోతుందంటూ సోషల్‌ మీడియాలో  బాగా జోరుగా ప్రచారం జరుగుతోంది.
'చూసి చూడంగానే' సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన వర్ష.. మిడిల్‌ క్లాస్‌ మెలోడిస్‌తో స్టార్‌ డమ్‌ తెచ్చుకుంది. ఈ చిత్రంతో ఆమెకు వరుస ఆఫర్స్‌ తలుపు తడుతున్నాయి. తాజాగా ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తమ్ముడు గణేశ్‌ సరసన స్వాతిముత్యంలో  సినిమలో కూడా నటించింది.
ఈ సినిమా తో ఆమె మరో హిట్‌ కొట్టేసింది అని మనం చెప్పవచ్చు. ప్రస్తుతం స్వాతిముత్యం సక్సెస్‌ ను  బాగా ఎంజాయ్‌ చేస్తున్న వర్ష పెళ్లి గురించిన వార్తలు ఒక్కసారిగా  సినీ ఇండస్ట్రీలో  బాగా గుప్పుమన్నాయి. అయితే తెరపై వర్ష అందం, అభినయాని కి ఓ సీనియర్‌ నిర్మాత కొడుకు ఫిదా అయ్యాడట మరీ. దాంతో ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పడంతో సదరు నిర్మాత ఒకే అనేశాడట. ఇక బయట కూడా వర్ష వ్యక్తిత్వం నచ్చడంతో ఆమెను కొడలిగా చేసుకునేందుకు ఆ మాజీ నిర్మాత ఆసక్తిగా ఉన్నాడట.
 నిర్మాత నిర్వాకం.. మరో మహిళతో షికారు.. భార్య రెడ్‌ హ్యండెడ్‌గా పట్టుకోవడంతో..
దీంతో ఆలస్యం చేయకుండా పెళ్లి విషయాన్ని వర్ష తల్లిదండ్రుల తో మాట్లాడాడట ఆ వ్యక్తి. ఇరు కుటుంబాలు చర్చించుకుని పెళ్లికి ఒకే చెప్పుకున్నారట మరీ. అంతేకాదు ఇప్పటికే నిశ్చితార్థానికి ముహుర్తం కూడా పెట్టుకున్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి మనకు సమాచారం. ఈ ఏడాది చివరిలో నిశ్చితార్థం, వచ్చే ఏడాదిలో పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు మాట్లాడుకున్నాయట. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో  మనకు ఇంకా తెలియదు కానీ, వర్ష ఓ పెద్దింటికి కోడలిగా వెళుతుందని తెలిసి ఆమె ఫ్యాన్స్‌  బాగా సంబర పడిపోతున్నారు. ఇక ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే వర్ష బొల్లమ్మ స్పందించేవరకు మనం వేచి చూడాల్సిందే మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: