రామ్ గోపాల్ వర్మ ద్శకత్వంలో పవర్ స్టార్ బయోపిక్ నిజమేనా..!!

murali krishna
సీఎం జగన్మోహర్ రెడ్డిని కలిసిన సంచలనాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన రాజకీయ సినిమా టైటిల్ పేరును ఖరారు చేశారు మరీ. తాను తీయబోయే సినిమాలు ఒకటి కాదు రెండంటూ మరో  పెద్ద బాంబు పేల్చారు అయన
మొదటి సినిమా వ్యూహం సినిమాగా ఆయన పేర్కొన్నారు. రెండో సినిమా శపధంగా సినిమాను చిత్రీకరించనున్నట్లు వర్మ  ఇలా తెలిపారు. రెండు సినిమాలు ఎవరి బయోపిక్ కు సంబంధించి కాదు. అంతకన్నా లోతైన రియల్ పిక్ మూవీలుగా అభివర్ణించారు అయన
బయోపిక్ లో అబద్ధాలు మాత్రమే ఉంటాయన్న వర్మ, రియల్ పిక్ సినిమా రెండింటిలో నూటికి నూరు పాళ్లు నిజాలే  కూడా ఉంటాయని స్పష్టం చేశారు. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన కధాంశమే వ్యూహం కధగా ఆయన తెలిపారు. చిత్ర నిర్మాణం ఆధ్యంతం రాజకీయ కుట్రలు, విషంతో నిండి వుంటుందన్నారు. రాచకురుపు పైన వేసిన కారంతో బొబ్బలెక్కిన ఆగ్రహానికి ప్రతికాష్ట లకు రూపాలే వ్యూహం, శపధం సినిమాలుగా ఆయన పేర్కొన్నారు.
రెండు సినిమాల్లోను రాజకీయ ఆరాచకీయాలు పుష్కలంగా వుంటాయని, రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం చూసిన షాక్ నుండి  ఇంక తేరుకొనే లోపే ఎలక్ట్రిక్ షాక్ తో రెండో చిత్రం శపధం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి కిక్ ఎక్కిస్తుందని వర్మ తనదైన శైలిలో  ఇలా పేర్కొన్నారు.
వంగవీటి సినిమాను తీసిన నాటి ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ నిర్మాణ సారధ్యంలో రెండు చిత్రాల నిర్మాణం సాగుతాయన్నారు. ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు కనక ,ఏం చెప్పాలో, ఏం చెప్పకూడదో చెప్పాల్సిన  అవసరం  నాకు ఏ మాత్రం లేదని మీకు వేరే చెప్పక్కర్లేదు కనక చెప్పట్లేదని రాజకీయ సినిమాపై వర్మ తేల్చి చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అడ్డుకొనేందుకు వర్మను ఓ సినిమా తీయాలని జగన్ తో సాగిన రహస్య చర్యలు నేపధ్యంలో సంచలనాల దర్శకుడు రాంగోపాల్ చూచాయగా అవునంటూ చెప్పేశారు మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: