సర్దార్ హిట్ తో సీక్వెల్ షురూ..!!!!

murali krishna
యం గ్ అండ్ టాలెంటెడ్ హీరో అయిన కార్తీ కోలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా బాగా ఫేమస్.. ఈయన చేసిన సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అవుతాయి.అందుకే ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. ఇక కార్తీ నాగార్జున తో కలిసి ఊపిరి సినిమాలో నటించి ప్రేక్షకులకు మరింత దగ్గర అయ్యాడు. దీంతో ఈయనను తెలుగు హీరోలానే భావిస్తారు..
ఇక ఈ మద్యే పొన్నియన్ సెల్వన్ లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు.. ఇక ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక దీపావళి కానుకగా కార్తీ 'సర్దార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఎస్ మిత్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించగా రిలీజ్ అయినా ఎన్నో చోట్ల మంచి స్పందన తెచ్చుకుంది.. ఈ సినిమాను తెలుగులో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి వసూళ్లు రాబడుతుంది.. దీంతో ఈ సినిమా సీక్వెల్ కూడా స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేసారు.. చెన్నైలో నిన్న సర్దార్ సక్సెస్ మీట్ జరుగగా ఈ సినిమాకు సీక్వెల్ ఉంది అని అధికారికంగా ప్రకటించారు..
అనౌన్స్ మెంట్ వీడియో కూడా మేకర్స్ ఆవిష్కరించారు. ''ఒక్కసారి గూఢచారి అయితే ఇక ఎల్లప్పుడూ గూఢచారే'' అనే ట్యాగ్ లైన్ తో సర్దార్ 2 వీడియో రిలీజ్ చేసారు. మొదటి భాగంలో ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణులే రెండవ భాగం కోసం కూడా పని చేయనున్నారు. వచ్చే ఏడాది చివర్లో ఈ సీక్వల్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.. ఈ సినిమా సీక్వెల్ ను కూడా ప్రిన్స్ పిక్చర్స్ ఎస్ లక్ష్మణ్ కుమార్ నే నిర్మించ నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: