కొత్త అప్డేట్ తో రాబోతున్న గాలోడు..!!

murali krishna
సుడిగాలి సుధీర్ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదనుకుంటా.. జబర్దస్త్ షోతో టివి ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్.
బుల్లి తెరపై మొదలైన సుడిగాలి సుధీర్ ప్రస్థానం అనతికాలంలోనే సిల్వర్ స్క్రీన్ పైకి చేరుకుంది. కామెడీ స్టార్ గా మొదలై సిల్వర్ స్క్రీన్ పై హీరోగా మారాడు సుడిగాలి సుధీర్. ప్రస్తుతం ఆయన 'గాలోడు' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ వచ్చింది. నిజానికి ఈ 'గాలోడు' సినిమా గురించి గత సంవత్సరంలోనే వార్తలు వచ్చాయి. అయితే చాలా రోజులు 'గాలోడు' సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. సినిమాల మీద ఇంట్రెస్ట్ తో హైదరాబాద్ వచ్చిన సుధీర్ కెరీర్ ప్రారంభంలో ఓ వైపు అవకాశాల కోసం తిరుగుతూనే మరోవైపు బతుకుతెరవు కోసం మ్యాజిక్ షో లు చేస్తుండేవాడు.
అలా కొన్నాళ్ళు చేసిన తర్వాత జబర్దస్త్ షోలో సుధీర్ కు అవకాశం వచ్చింది. మొదట్లో స్కిట్ లలో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సుధీర్ తర్వాత టీమ్ లీడర్ గా ఎదిగాడు. ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీనుతో కలసి తిరుగులేని టీమ్ గా జబర్దస్త్ లో ఎదిగారు. ఇక రష్మీ, సుధీర్ ఆన్ స్క్రీన్ లవ్ ట్రాక్ లు సుధీర్ కెరీర్ ను ఇంకా వేగవంతం చేశాయి. అటు జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా ఇటు టీవీ షోలలో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుధీర్. తర్వాత సిల్వర్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి హీరో గా ట్రై చేశాడు. 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌', '3 మంకీస్‌' లాంటి సినిమాల్లో నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ సినిమాలు అంతగా హిట్ అవ్వకపోయినా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి.
ఆ సినిమాల తర్వాత కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న సుధీర్ 'గాలోడు' సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమాకు సంబంధించి గతంలోనే టీజర్ ను విడుదల చేసింది సినిమా టీమ్. టీజర్ లో కూడా సుధీర్ లుక్స్ బాగుండటంతో మంచి టాక్ వచ్చింది. టీజర్ లో డైలాగ్స్ కూడా బాగున్నాయి. ఈ టీజర్ చూసిన సుధీర్ అభిమానులు ఈసారి సుధీర్ కు సూపర్ హిట్ పక్కా, సుధీర్ మాస్ హీరో గా సెటిల్ అయిపోతాడని కామెంట్స్ కూడా చేశారు. ఈ టీజర్ తర్వాత చాలా రోజులు సినిమా నుంచి అప్డేట్ రాలేదు.
చాలా గ్యాప్ తర్వాత 'గాలోడు' సినిమా నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. సినిమాలో ఒక సాంగ్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. సినిమాలో 'వైఫై నడకలదాన' అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. పాట మధ్య మధ్యలో సుధీర్ తన స్టైల్ లో స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాపై సుడిగాలి సుధీర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకత్వం వహిస్తున్నారు. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా పరిచయమవుతోన్న ఈ సినిమాను ప్రకృతి సమర్పణ లో సంస్కృతి ఫిలింస్ నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: