లీక్ ఐనా వాల్తేరు వీరయ్య మూవీస్టోరీ...!!

murali krishna
చాలా కాలం తర్వాత చిరంజీవి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ సినీమాలో చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య గా చిరంజీవి వీర విహారం చేయనున్నారు.వాల్తేరు వీరయ్య టీజర్ దీపావళి కానుకగా విడుదల కాగా కథ ఇదేనంటూ ఓ వార్త టాలీవుడ్ లో బాగా చక్కర్లు కొడుతుంది.
మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. దీపావళి కానుకగా మూవీ టీజర్ విడుదల చేశారు. చిరంజీవి ఊరమాస్ లుక్ లో అందరినీ కట్టిపడేశారు. వింటేజ్ చిరు మనకు గుర్తుకు వచ్చారు. ఇక సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. చిరంజీవి అభిమానులు పండగ చేసుకుంటున్నారు అని చెప్పొచ్చు
ఈ క్రమంలో వాల్తేరు వీరయ్య మూవీ కథ ఇదేనంటూ ఓ వార్త తెరపైకి వచ్చింది మరీ,ఈ న్యూస్ టాలీవుడ్ లో బాగా హాట్ టాపిక్ గా మారింది. వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. రవితేజ ఈ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. వాల్తేరు వీరయ్య మూవీలో రవితేజ పాత్ర ఏంటనే ఆసక్తి నెలకొని ఉంది.
కాగా ఈ మూవీలో చిరంజీవి-రవితేజ అన్నదమ్ములుగా కనిపిస్తారట మరీ, అయితే వీరి తండ్రి ఒకరు కాగా తల్లులు వేరట. సవతి తల్లులకు పుట్టిన వీరిద్దరి మధ్య సంఘర్షణ ఉంటుందనేది టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో ఎవరికి తెలియదుకానీ ప్రముఖంగా ప్రచారం ఇదే బాగా అవుతుంది.
కెరీర్ బిగినింగ్ లో రవితేజచిరంజీవి తమ్ముడుగా చేశారు. 2000 సంవత్సరంలో విడుదలైన అన్నయ్య మూవీలో చిరంజీవి ఇద్దరు తమ్ముళ్లలో ఒకడిగా రవితేజ నటించడం జరిగింది. దాదాపు 22 ఏళ్ళ తర్వాత మరలా రవితేజ ఆయనకు తమ్ముడిగా నటిస్తున్నారని అంటున్నారు.
అలాగే మరొక వాదన కూడా బాగా వినిపిస్తోంది. 2005లో చిరంజీవి-శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కిన అందరివాడు మూవీతో వాల్తేరు వీరయ్యకు సినిమా లింక్ ఉంది అంటున్నారు. అది ఎలాంటి లింక్ అనేది సస్పెన్సు అంటూ ఆరోపణలు వస్తున్నాయి. అధికారిక సమాచారం లేకున్నప్పటికీ వాల్తేరు వీరయ్య కథపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: