చూపించడంలో తెగించిన రకుల్ ప్రీత్ సింగ్..!!

murali krishna
స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఊపేసింది రకుల్. ఒక దశాబ్దం పాటు ఆమె హవా సాగింది. వరుస ప్లాప్స్ తెలుగు ప్రేక్షకులకు దూరమైన రకుల్ బాలీవుడ్ కి షిప్ట్ అయ్యారు.కెరటం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ కి వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బ్రేక్ ఇచ్చింది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం తర్వాత రకుల్ కి తెలుగులో అవకాశాలు క్యూ కట్టాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్ ఇలా టాప్ స్టార్స్ అందరితో నటించే ఛాన్స్ దక్కింది. నాన్నకు ప్రేమతో, సరైనోడు వంటి హిట్స్ ఆమె ఖాతాలో పడ్డాయి. హిట్ పర్సెంటేజ్ తక్కువైనా కానీ రకుల్ కి ఆఫర్స్ తగ్గలేదు. 2014 నుండి 2017 వరకు జోరు కొనసాగింది. అదే టైం లో మెల్లగా బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. 2019లో విడుదలైన దే దే ప్యార్ దే మూవీ రకుల్ కి మంచి గుర్తింపు తెచ్చింది. కమర్షియల్ గా కూడా మూవీ ఆడింది. ఈ మధ్య కాలంలో రకుల్ ప్రీత్ నటించిన తెలుగు చిత్రాలు చెక్, కొండపొలం డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో రకుల్ కి ఇక్కడ అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం రకుల్ ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే ఉంది. కాగా నెలల వ్యవధిలో రకుల్ ఐదు చిత్రాలు విడుదల చేశారు. ఇక రకుల్ లేటెస్ట్ మూవీ థాంక్ గాడ్ అక్టోబర్ 25న విడుదలైంది. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ దక్కింది. వసూళ్లు పర్వాలేదు అన్నట్లున్నాయి. విజయాలు దక్కకున్నా ఆఫర్స్ మాత్రం ఆగడం లేదు. మరో రెండు బాలీవుడ్ చిత్రాలు రకుల్ ప్రీత్ ఖాతాలో ఉన్నాయి. అలాగే మరో రెండు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు 2 మూవీలో రకుల్ ప్రీత్ నటిస్తున్నారు. మధ్యలో ఆగిపోయిన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల తిరిగి ప్రారంభమైంది. మరోవైపు రకుల్ పెళ్లి వార్తలు మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రియుడు జాకీ భగ్నానితో ఆమె ఏడు అడుగులు వేయనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ ప్రీత్ ఇదే విషయాన్ని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: