అదిరిపోయిన చేపల టాస్క్ ఇన్ బిగ్ బాస్...!!

murali krishna
ఈ ఎపిసోడ్లో బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు చేపల టాస్కు ఇచ్చారు బిగ్ బాస్. ఇన్నాళ్లు పెద్దగా ఆడని వారు కూడా ఫిజికల్‌గా ఆడారు.
ముఖ్యంగా రోహిత్ ఇంతకుముందే ఆడినట్టే కనిపించలేదు, కానీ ఈ ఆటలో మాత్రం బాగా ఆడాడు. కెప్టెన్సీ కంటెండర్ల టాస్కుగా 'చేపల టాస్కు' ఇచ్చారు. దీనిలో ఇద్దరిద్దరు జంటగా ఆడమని ఇచ్చారు.
1. రేవంత్ - ఇనయా
2. శ్రీహాన్ - శ్రీసత్య
3. సూర్య - వాసంతి
4. రాజ్ - ఫైమా
5. రోహిత్ - కీర్తి
6. బాలాదిత్య - మెరీనా
7. ఆదిరెడ్డి - గీతూ జంటలుగా విడదీసి ఆడమని చెప్పారు బిగ్ బాస్.
గీతూ కన్నింగ్ ప్లాన్
ఇక గీతూ ఆటకు ముందే రేవంత్‌తో పోటీపడలేమని అతడిని రెచ్చగొడితే చేపలు ఏరడం మానేస్తాడని, ఇనయా ఒక్కతే ఏరలేదని, అలా చేద్దామని ఆదిరెడ్డితో చెప్పింది గీతూ. అలాగే కీర్తిని కూడా ఏదైనా అంటే ఆడడం మానేస్తుందని చెప్పింది. కానీ ఆమె అనుకున్నట్టు ఏం జరుగలేదు. గొడవ పడుతూనే అందరూ ఆడుతూనే ఉన్నారు. గీతూ మాత్రం మెరీనా - రోహిత్ ను రెచ్చగొట్టింది. రోహిత్‌ను రెచ్చగొట్టి గొడవకు దిగింది. మెరీనాతో కూడా చాలా గట్టిగా గొడవపెట్టుకుంది. కానీ ఆమె ఊహించని విధంగా వాళ్లు రివర్స్ అయ్యి గట్టిగా స్టాండ్ తీసుకుని ఆడారు. చివరికి అందరి కన్నీ తక్కువగా ఆదిరెడ్డి - గీతూ దగ్గరే చేపలు ఉన్నాయి. దీంతో గీతూ ఏడవడం మొదలుపెట్టింది. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి గీతూకి.
ఇక గోల్డెన్ కాయిన్ రేవంత్‌కు దొరికింది. దీంతో తమతో పోటీపడే వారిని ఎంచుకోమన్నారు బిగ్ బాస్. 'పుష్ ఫర్ ఫిష్' అనే టాస్కు ఇచ్చారు. ఒక బండిపై నలుగురు కూర్చుని ఉండగా నలుగురు పుష్ చేయాలి. మొదటి రౌండ్లో రాజ్- బాలాదిత్య టీమ్ విజయం సాధించారు. ఇక రెండో రౌండ్లో రాజ్ - ఫైమా గెలిచారు. ఎపిసోడ్ ముగిసే సరికి ఆదిరెడ్డి - గీతూ దగ్గర కేవలం 24 చేపలు ఉన్నాయి. దీంతో వారిద్దరూ కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ నుంచి తొలగిపోయినట్టు చెప్పాడు బిగ్బాస్. తన దగ్గర ఉన్న చేపల్ని గీతూ గాల్లోకి విసిరేసింది.
వారికి పనిష్మెంట్..
కాగా గోల్డ్ కాయిన్ వెతికేందుకు పూల్‌లో దిగినప్పుడు సత్య,సూర్య మైక్‌లు తీయలేదు. దీంతో అవి తడిసిపోయి పాడైపోయాయి. దీంతో వారికి బిగ్ బాస్ పనిష్మెంట్ ఇచ్చారు. వారి దగ్గర నుంచి పది చేపలను జరిమానా తీసుకున్నారు.
కాగా ఈ వారం ఇంట్లో ఉన్న అందరూ నామినేషన్లో ఉన్నారు. కాబట్టి ఎవరూ ఇంటి నుంచి బయటికి వెళతారో అంచనా వేయడం కూడా చాలా కష్టం. వాసంతి, రోహిత్, మెరీనాలలో ఒకరు బయటికి వెళ్లే అవకాశాలు ఉన్నట్టు అంచనా. వీరిలో ఎక్కువగా వాసంతికే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: