కాంతార: ఇంకా తగ్గని వసూళ్లతో ప్రభంజనం?

Purushottham Vinay
కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి హీరోగా కాంతార ది లెజెండ్ అంటూ కర్నాటకలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ముఖ్యంగా అక్కడ జానపద కళ మన దగ్గర భూత కోలం (సిగమూగే) ను ఎంత చక్కగా తెరపై ఆవిష్కరించాడు. ఈ సినిమా షూట్ రిషబ్ శెట్టి వాళ్ల సొంత ఊర్లో జరపడం విశేషం.స్వయంగా వాళ్ల కుటుం సభ్యులు కొలం చేస్తారని చెప్పుకొచ్చాడు.సినిమాను కెజియఫ్ వంటి పాన్ ఇండియా హిట్ చిత్రాన్నినిర్మించిన విజయ్ కిరగందూర్ హోంబలే ఫిలింస్ లో నిర్మించారు. ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది.రీసెంట్‌గా ఈ చిత్రం తెలుగు,తమిళంలో అక్టోబర్ 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీలో అక్టోబర్ 14న విడుదలైంది. మలయాళంలో మాత్రం అక్టోబర్ 20న గ్రాండ్‌గా రిలీజైంది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తుంది.


ఈ సినిమా చూడటానికి థియేటర్స్ దగ్గర జనాలు బెల్లం చుట్టూ ఈగల్ల వాలుతున్నారు. ఈ సినిమా చివరి 30 నిమిషాలు ప్రేక్షకులను గగుర్పాటుకు గురిచేస్తోంది.తెలుగులో కాంతార రూ. 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి 2.30 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 16.51 కోట్ల రాబట్టింది. మొత్తంగా రూ. 14.21 కోట్ల లాభాలను ఆర్జించింది. అంటే పెట్టిన పెట్టుబడికి నాలుగింతలు లాభాలను తీసుకొచ్చింది. ఓవరాల్‌గా ఈ చిత్రం ముందు ముందు ఎలాంటి సంచనాలు నమోదు చేస్తుందో చూడాలి. ఇక హిందీలో ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 29.10 నెట్ వసూళ్లను రాబట్టి అక్కడ కూడా సత్తా చాటుతోంది. ఓవరాల్‌గా రూ. 200 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లతో సత్తా చూపెడుతుంది.ఇక యూ ఎస్ లో అయితే ఓన్లీ కన్నడ వెర్షన్ మాత్రమే 1 మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: