ఆ హీరో చేతుల మీదుగా విడుదల కానున్న సమంత "యశోద" హిందీ ట్రైలర్..!

Pulgam Srinivas
దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ఉన్న నటీమణులలో ఒకరు అయినా సమంత ప్రస్తుతం యశోద అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా ,  ఉన్ని ముకుందన్ , వరలక్ష్మి శరత్ కుమార్ ,  రావు రమేష్ , మురళి శర్మ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ని నవంబర్ 11 వ తేదీన తెలుగు తో పాటు తమిళ , కన్నడ ,  మలయాళం , హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదలకు సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది.
 

అందులో భాగంగా ఈ మూవీ హిందీ ట్రైలర్ ను బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి వరుణ్ ధావన్ చేతుల మీదుగా ఈ రోజు అనగా అక్టోబర్ 27 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం యశోద మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే. పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కడం ,  అలాగే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: