సైలెంట్ గా స్టార్ట్ అయిన ప్రభాస్... మారుతి మూవీ..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి మూవీ వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగిన ప్రభాస్ "మిర్చి" మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ మూవీ లతో పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దానితో ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియా మూవీ లలో మరియు అంతకు మించిన మూవీ లలో నటిస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇది ఇలా ఉంటే ప్రభాస్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి మారుతీ దర్శకత్వంలో తేరకేక్కబోయే మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటికే ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ ప్రారంభం అయింది అని , ఈ సినిమా షూటింగ్ ను పెద్దగా ఎలాంటి హడావిడి లేకుండా ,  సైలెంట్ గా జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కథ ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్ లు నటించబోతున్నట్లు ,  అందులో భాగంగా ఈ మూవీ లో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ ,  మాళవిక మోహన్ హీరోయిన్ లుగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటులలో ఒకరు అయినటు వంటి సంజయ్ దత్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను మూవీ యూనిట్ పరిశీలిస్తున్నట్లు , ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం ఒకే సెట్ లో జరగనున్నట్లు , ఈ మూవీ హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు ఒక వార్త చాలా రోజుల నుండి వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: