నటి మీనా రయస్య వివాహం నిజమేనా..!!

murali krishna
స్టార్ నటి మీనా.. ఒకప్పుడు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ఓక వెలుగు వెలిగింది అని చెప్పొచ్చు. దక్షిణాదిలో అగ్రహీరోలందరితో నటించి మెప్పించిన నటి. తెలుగులో వెంకటేశ్, నాగార్జున సహా తమిళంలో రజినీకాంత్, కమల్ హాసన్, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ ఈ స్టార్లతో జోడీ కట్టింది ఈ నటి
గత 40 ఏళ్లుగా సినిమా పరిశ్రమలో సత్తా చాటుతూనే ఉంది  నటి మీనా. ఇటీవల తన భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో మీనా కొన్నాళ్లు  బాగా డిప్రెషన్‌లో ఉండిపోయింది.ఇక ఇప్పుడిప్పుడే ఆ డిప్రెషన్ నుండి బయటపడ్డ మీనా పలు సినిమాలు,టీవీ షోలతో బిజీగా ఉంది.
1982 లో తొలిసారి గా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత ఎనిమిదేళ్ళకు రాజేంద్ర ప్రసాద్ హీరోగా నవయుగం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 1990 లలో హీరోయిన్ గా ఎంటర్ అయిన మీనా 2009 వరకు ఆమె సినిమాలతో కాకుండా ఎన్నో కాంట్రవర్సీ లను కూడా ఎదుర్కొంది. మరి ముఖ్యంగా మీనా పెళ్లి విషయంలో చాలా మంది హీరోలతో ఆమె పేరును జోడించి వార్తలు  తెగ వచ్చేవి. కన్నడ హీరో కిచ్చా సుదీప్ తో రహస్యంగా వివాహం చేసుకుంది అని వార్తలు రావడం తో ఒక్కసారి సౌత్ ఇండియాలో ని అన్ని పరిశ్రమలు ఉలిక్కి పడ్డాయి. సుదీప్ - మీనా రెండు సినిమాల్లో నటించగా ఈ వార్తలకు మరింత బలం చేకూరింది అని చెప్పొచ్చు, సుదీప్ చెప్పిన విషయం ప్రకారం " మీనాతో నా రహస్య వివాహానికి సంబందించిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు ఈ నటుడు పేర్కొన్నారు."
అని చెప్పారు. అయినా కూడా పెళ్లి గురించి వస్తున్న వార్తలు తగ్గకపోవడంతో మీనా సైతం ఒక స్టేట్మెంట్ ఇచ్చింది.మీడియా ఎప్పుడు నా పెళ్లి విషయంలో బాగా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. ఇది మూడో సారి నాకు మీడియా పెళ్లి చేయడం. అంటూ నటి మీనా గట్టిగానే బదులిచ్చింది. సుదీప్ నేను మంచి స్నేహితులం మాత్రమే. మేము ఇద్దరం కలిసి కేవలం రెండు సినిమాలు మాత్రమే కలిసి నటించాం. నా పెళ్లికి నేను ఆహ్వానం పంపి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను." అని  ఇలా చెప్పుకొచ్చింది  ఈ నటి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: