నెట్ ఫ్లిక్స్ కు వార్నింగ్ ఇచ్చిన ప్రభాస్ ఫ్యాన్స్.. ఎందుకంటే?

Satvika
తెలుగు రెబల్ స్టార్,పాన్ ఇండియా హీరో ప్రభాస్ పేరుకు పెద్దగా పరిచయం లేదు..సినిమాలు తక్కువ అయినా కూడా ఫ్యాన్స్ మాత్రం తగ్గలేదు..ఈయన సినిమాలు ఆలస్యంగా వచ్చినా కూడా ఫ్యాన్స్ హంగామాలు తగ్గవు..ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రభాస్ ఆ తర్వాత వర్షం , చక్రం, చత్రపతి, బిల్లా, మిర్చి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు..బాహుబలి సినిమాలో నటించిన ప్రభాస్ ఆ సినిమా ద్వారా ఇటు సౌత్ అటు నార్త్ ఇండస్ట్రీలలో హీరోగా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుని పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందాడు.


తాజాగా ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాదితో ప్రభాస్ 42వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. ఈ క్రమంలో ప్రభాస్ పుట్టినరోజు భాగంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ కూడా ప్రభాస్ పుట్టినరోజున శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే నెట్ ఫ్లిక్స్ తెలిపిన విశేష్ చూసి ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


విషయానికొస్తే.. బాహుబలి చిత్రంలో రానాని చంపటానికి ప్రభాస్ పెద్ద బండరాయి ఎత్తిన ఫోటోని ఎడిట్ చేసి ఆ రాయి స్థానంలో కేక్ పెట్టి ప్రభాస్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే ఈ ఫోటో చూసిన ప్రభాస్ అభిమానులు కావాలనే ప్రభాస్ ని అవమానపరిచేలా ఈ ఫోటో ఎడిట్ చేశారని.. బాలీవుడ్ కోసమే నెట్ ఫ్లిక్స్ ఇలా చేసిందని ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎక్కువ సపోర్ట్ ఇచ్చే నెట్ ఫ్లిక్స్ ప్రభాస్ విషయంలో ఇంత దిగజారి పోవటం మంచిది కాదని కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చర్చనీయాంశంగా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: