సమంత "యశోద" మూవీ మలయాళం ట్రైలర్ ను విడుదల చేయనున్న ఆ స్టార్ హీరో..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటికే ఎన్నో కమర్షియల్ మూవీ లలో నటించి తన అంద చందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అలాగే సమంత ఎన్నో లేడీ ఓరియంటెడ్ సినిమాలలో తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ లలో నటించి తన నటన తో కూడా ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఇలా కమర్షియల్ సినిమాలతో , లేడీ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఎంత గానో అలరించిన సమంత పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప ది రైస్ మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించి తన అంద చందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సాంగ్ తో సమంత  పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది.
 

ఇది ఇలా ఉంటే సమంత తాజాగా యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. హరి శంకర్ ,  హరీష్ నారాయణ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించగా ,  మణిశర్మ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఉన్ని ముకుందన్ , వరలక్ష్మి శరత్ కుమార్ , మురళీ శర్మ , రావు రమేష్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ని నవంబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 27 వ తేదీన 5 గంటల 30 నిమిషాలకు  విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ మలయాళం ట్రైలర్ ను దుల్కర్ సల్మాన్ విడుదల చేయనున్నట్లు కూడా చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: