సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త బిజినెస్ స్టార్ట్?

Purushottham Vinay
ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీలో అత్యధిక స్థాయిలో కమర్షియల్ యాడ్స్ ద్వారా మంచి ఆదాయాన్ని అనుకుంటున్న అతి కొద్ది మంది హీరోలలో టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు.ఎక్కువగా తన భార్య నమ్రత సలహాతోనే మహేష్ బాబు నేషనల్ బ్రాండ్స్ తో కూడా చేతులు కలుపుతూ ఉంటాడు. మహేష్ సినిమా కథలకు సంబంధించి సొంత నిర్ణయాలు తీసుకుంటాడు. కానీ ఏదైనా ఆర్థికంగా సలహాలు కావాలంటే మాత్రం నమ్రత చేతుల్లోనే ఉంటుందని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంటుంది.నమ్రత మాజీ మిస్ ఇండియా కావడంతో ఆమెకు బాలీవుడ్ యాడ్స్ ఏజెన్సీలతో కూడా మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లో కూడా మహేష్ త్వరలోనే డిఫరెంట్ యాడ్స్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మహేష్ బాబు ఇప్పటికే కొన్ని వ్యాపారాలు కూడా స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.ముఖ్యంగా ఏషియన్ సినిమాస్ తో కలిసి స్థాపించిన ఏఎంబి మల్టీప్లెక్స్ మంచి ప్రాఫిట్స్ అయితే అందిస్తోంది.


దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన కొన్ని థియేటర్లలో AMB కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మహేష్ బాబు హోటల్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టబోతున్నారు అని ఇటీవల కొన్ని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఒక పాష్ ఏరియాలో ఆ హోటల్ నిర్మాణం జరుగుతున్నట్లు సమాచారం తెలుస్తుంది.అయితే ఆ హోటల్ కు ఇష్టమైన భార్య పేరు వచ్చేలా మహేష్ నామకరణం చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో కూడా ఏషియన్ వాళ్ళు భాగస్వామ్యం కాబోతున్నట్లు సమాచారం. ఏషియన్ నమ్రత పేరుతో ఏర్పాటు చేస్తున్న హోటళ్లు ఒకటి (మినర్వా ఎఎన్) నవంబర్ లో స్టార్ట్ కానుందట. మరొకటి (పాలస్ హైట్స్) డిసెంబర్ లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28 వ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తరువాత ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: