సమంత "యశోద" మూవీ కన్నడ ట్రైలర్ ను విడుదల చేయనున్న ఆ స్టార్ హీరో..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్ లలో ఒకరు అయిన సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరోయిన్ గా నటించి , తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే సమంత తాజాగా యశోద అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లేడీ ఓరియంటెడ్ మూవీ గా తెరకెక్కింది. ఈ మూవీ కి హరి శంకర్ , హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ లో ఉన్ని ముకుంద‌న్‌ , వరలక్ష్మి శరత్ కుమార్ , రావు రమేశ్ , మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రలలో నటించగా, మణిశర్మ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ని నవంబర్ 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిటీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.
 

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ట్రైలర్ ను అక్టోబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిటీ ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా కన్నడ ట్రైలర్  విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను తాజాగా ప్రకటించింది. తాజాగా యశోద మూవీ కన్నడ ట్రైలర్ ను కన్నడ ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కొనసాగుతున్న రక్షిత్ శెట్టి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ,  ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. రక్షిత్ శెట్టి తాజాగా 777 చార్లీ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: