రీ రిలీజ్ కూ సిద్దమైన.. ఆ అందమైన లవ్ స్టోరీ?

praveen
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే . ఎంతో మంది స్టార్ హీరోలు తమ కెరియర్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ ఇక ప్రేక్షకుల ముందుకు అధునాతన టెక్నాలజీ మధ్య తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి స్టార్ హీరోలు సూపర్ హిట్ సినిమాలు అన్నీ కూడా సందర్భానుసారం వరుస పెట్టి థియేటర్లలో విడుదలవుతూ సెన్సేషన్స్ సృష్టిస్తున్నాయి.  కొంతమంది హీరోలు సినిమాలు పుట్టినరోజు కానుకగా మళ్లీ థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటే మరికొన్ని సినిమాలు అటు 20 ఏళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా  వెండితెరపై మరోసారి సందడి చేస్తూ ఉండడం గమనార్హం.
 ఇలా గత కొన్ని రోజుల నుంచి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అవుతూ థియేటర్లలో సందడి చేస్తూ ఫ్యాన్స్ అందరిని కూడా ఉరూతలు ఇస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఈ లిస్టు లోకి మరో స్పెషల్ మూవీ వచ్చి చేరింది అనేది తెలుస్తుంది. అయితే ఇప్పుడు రిలీజ్ సిద్ధమైన సినిమాలో స్టార్ హీరోలు లేరు.. కానీ సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ విజయం సాధించింది అని చెప్పాలి. ఈ సినిమాలోని లవ్ స్టోరీ అటు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ గా ఈ సినిమాలు నిలిపింది. ఆ సినిమా ఏదో కాదు ప్రేమదేశం.

 90 ల్లో కుర్ర కారుకు హాట్ ఫేవరెట్ మూవీగా కొనసాగింది ఇది. అబ్బాస్, వినీత్ హీరోలుగా నటించిన ఈ సినిమాలో టబూ హీరోయిన్గా నటించింది. త్రికోణ ప్రేమ కథ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఒక ఊపు ఊపింది. ఇక ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం అయితే ఇప్పటికీ కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ గురించి చెప్పే ముస్తఫా సాంగ్ అయితే ఇప్పటికి అందరి నోటా వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక మరోసారి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారట శ్రీ మాతా క్రియేషన్స్ అనే బ్యానర్ ఈ సినిమాలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. దీంతో ఈ సినిమా రిలీస్ కోసం అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: