బిజినెస్ రంగంలో కి రాబోతున్న మహేష్ బాబు..!!

murali krishna
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకపక్క సినిమాల్లో హీరోగా నటిస్తూనే మరో పక్క పలు వ్యాపారాలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఏషియన్ సంస్థతో కలిసి ఆయన ప్రస్తుతానికి ఏషియన్ మహేష్ బాబు మాల్ నిర్వహిస్తున్నారు. ఇక ఆయన నిర్మాతగా కూడా పలు సినిమాలు కూడా చేస్తున్నారు, తాను హీరోగా నటిస్తున్న సినిమాల్లో కూడా సొంతంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే సూపర్ స్టార్ మహేష్ బాబు హోటల్ వ్యాపారంలోకి దిగే అవకాశం  కూడా ఉందని కొన్నాళ్ల క్రితం ప్రచారం బాగానే జరిగింది.
అయితే అదంతా ఒట్టిదే అని అనుకున్నారు కానీ తాజాగా అందుతున్న సమాచారం మేరకు మహేష్ బాబు హోటల్స్ బిజినెస్ దాదాపు ఖరారు అయినట్లేనని రెండు చోట్ల ఈ హోటల్స్ ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారునెటిజన్స్ ఇప్పటికే బంజారాహిల్స్ ప్రాంతంలోని ఒక హోటల్ అయితే ఓపెనింగ్ కి సిద్ధమవుతోంది, ఏషియన్ నమ్రతా పేరుతో మహేష్ బాబు ఈ హోటల్స్ వ్యాపారం ప్రారంభిస్తున్నారు అని అంటున్నారు.
ఏషియన్ నమ్రత అనే పేరుతో ఒక హోటల్ నవంబర్ లో ప్రారంభం కానుండగా మరొక హోటల్ ప్యాలెస్ హెడ్స్ ఏషియన్ నమ్రతా పేరుతో డిసెంబర్ లో ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి మహేష్ కంటే ముందే చాలామంది సినిమా హీరోలు ఈ హోటల్ వ్యాపారంలో ఉన్నారు, సందీప్ కిషన్, నవదీప్, అల్లు అర్జున్, వంటి వారు కొన్ని బ్రాండ్ల పేరుతో హోటల్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మహేష్ బాబు మాత్రం తన భార్య  నమ్రత పేరుతో అలాగే ఏసియన్ సంస్థ భాగస్వామ్యంతో ఈ హోటల్ బిజినెస్ చేస్తూ ఉండడం ఆసక్తికరంగా మారింది.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు తన కెరీర్ లో 28వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఒక షెడ్యూల్ పూర్తయిన తర్వాత మహేష్ తల్లి మరణించడంతో రెండో షెడ్యూల్ కు  చాలా గ్యాప్ వచ్చింది. మహేష్ బాబు తన కుమారుడిని డ్రాప్ చేసేందుకు వెళ్లారు అక్కడి నుంచి తిరిగి వచ్చాక మరో షెడ్యూల్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: