వాళ్లతో పోటీ సిద్ధమైన ఏజెంట్.. రిస్క్ చేస్తున్నాడుగా..!

shami
అక్కినేని అఖిల్ ప్రస్తుతం చేస్తున్న ఏజెంట్ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్ లాక్ చేశారు. దీపావళికి పోస్టర్స్ రిలీజ్ చేయగా ఆ పోస్టర్ లో రిలీజ్ ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రత్యేకంగా డేట్ మెన్షన్ చేయలేదు కానీ ఏజెంట్ మూవీ సంక్రాంతి రిలీజ్ అని ఫైనల్ చేశారు. అయితే ఇప్పటికే సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతి బరిలో ఆదిపురుష్, వారసుడు పాన్ ఇండియా సినిమాలుగా రిలీజ్ అవుతున్నాయి. ఆ రెండిటితో పాటుగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా సంక్రాంతికే డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. ఇది సరిపోదు అన్నట్టుగా నందమూరి బాలకృష్ణ వీర సిం హా రెడ్డి పొంగల్ రేసుకి దిగుతున్నాడు.
ఇలా అందరు సంక్రాంతి రిలీజ్ అని పోస్టర్స్ మాత్రం వేస్తున్నారు. అయితే సంక్రాంతి సినిమాల్లో ఇప్పుడు ఏజెంట్ కూడా నిలుస్తుందని ఈరోజు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఉంచారు. ఏజెంట్ సినిమా స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వస్తుంది. సైరా తర్వాత సురేందర్ రెడ్డి చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది. ఈ సినిమా రిలీజ్ అది కూడా సంక్రాంతి టైం లో ఇంత పోటీలో రిస్క్ చేయడం కరెక్ట్ కాదని చెప్పొచ్చు. ముఖ్యంగా బాలయ్య, చిరంజీవి మెగా నందమూరి సినిమాలు వస్తే మిగతా సినిమాలకు అసలు ఛాన్స్ ఉండదు. మరి అలాంటిది అఖిల్ ఎలా ఈ డేర్ స్టెప్ వేస్తున్నాడు అన్నది అర్ధం కావట్లేదు.
ఏజెంట్ సినిమాలో అఖిల్ తన యాక్షన్ సీన్స్ తో అదరగొడతాడని తెలుస్తుంది. సినిమాలో అతనికి జోడీఆ సాక్షి వైద్య నటిస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఏజెంట్ టీజర్ మాత్రం అంచనాలను పెంచింది. అఖిల్ కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా సంక్రాంతికి వచ్చి అంత పోటీలో కూడా హిట్టు కొడితే మాత్రం అక్కినేని అఖిల్ మొనగాడు అనిపించుకున్నట్టే లెక్క. అయితే రిస్క్ అయినా సరే రిలీజ్ డేట్ విషయంలో వెనక్కి తగ్గేదేలేదు అంటున్నారు మేకర్స్. మరి రిలీజ్ అవ్వాల్సిన సినిమాల్లో ఏదైనా మూవీ వాయిదా పడుతుందేమో చూడాలి. అప్పుడు అఖిల్ కొంత సేఫ్ అయ్యే చాన్స్ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: