నాట్యంతో అందరిని ఆకట్టుకున్న సితార...!!

murali krishna
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకం గా చెప్ప క్కర్లేదట. చిన్న వయసు లో నే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుందట.సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ ‏గా ఉంటూ..
ఫ్యామిలీ విషయా లే కాకుండా.. చిన్నారుల కు అవసరమైన సమాచారాన్ని షేర్ చేస్తుంటుంది. చదువు లోనే కాకుండా అన్నింటిలో నూ తన ప్రత్యేకతను చాటుకుంటోందట.. తన స్నేహితురాలి తో కలిసి ఏకంగా ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అందరి తో శభాష్ అనిపించు కుందట. పాటలు.. డ్యాన్స్.. ఆటలు ఒక్కటేమిటి అన్నింట్లోనూ తన టాలెంట్ ను ప్రదర్శిస్తోంది. ఇప్పటికే సీతుపాప ప్రతిభను చూసి మహేష్ బాబు దంపతులు తెగ మురిసిపోతున్నారట.తాజాగా తన కూతురు శాస్త్రీయ నృత్యం చేస్తోన్న వీడియో ను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు మహేష్ బాబు. నువ్వు ఎప్పుడు గర్వపడే లా చేస్తావు అంటూ రాసుకొచ్చార ట..
నువ్వు నన్ను గర్వపడే లా చేయడం లో ఎప్పుడూ విఫలం కావు. మై లిటిల్ వన్. దీపావళి శుభాకాంక్షలు అంటూ సీతుపాప భారత నాట్యం చేస్తున్న వీడియో ను షేర్ చేశారు మహేష్. అందు లో తన గురువు మహతి భిక్షు తో కలిసి అద్భుతమైన హావభావాల తో ఎంతో అందం గా నృత్యం చేస్తుంది సీతార. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సితార డ్యాన్స్ వీడియో చూసి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నార ట.
ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం లో ఓ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే కథానాయిక గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ మూవీ తర్వాత జక్కన్న దర్శకత్వం లో భారీ బడ్జెట్ పాన్ ఇండియా చేయబోతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: